పెద్ద‌ల స‌భ‌కు సంతోష్ కుమార్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-16 04:20:41

పెద్ద‌ల స‌భ‌కు సంతోష్ కుమార్

మార్చిలో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ‌ ఎన్నిక‌ల కోసం అభ్య‌ర్దుల ఎంపిక‌కు టీఆర్ఎస్ క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టింది.ఇటీవ‌ల మ‌ర‌ణించిన పాల్వాయి గోవ‌ర్ద‌న్ రెడ్డితో పాటు రాపోలు అనంద‌భాస్క‌ర్ (కాంగ్రెస్), సి.ఎం.ర‌మేష్(టీడీపీ) రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం వ‌చ్చే ఏప్రిల్ తో  మ‌గియ‌నుంది. 
 
వీరి స్దానంలో కొత్త‌గా ముగ్గురు  తెలంగాణ నుంచి ఎన్నిక అవ్వాల్సి  ఉంటుంది.  ఇత‌ర పార్టీల‌కు  ఒక్క ఎంపీని కూడా   గెలిపించుకునేంత సంఖ్యా బ‌లం లేనందున మూడు స్దానాల‌నూ టీఆర్ఎస్ ఏక‌గ్రీవంగా గెలుచుకోనుంది. వీటిలో ఒక‌టి టీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ కు దాదాపుగా ఖ‌రారైన‌ట్టేన‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మచారం.
 
దశాబ్ద‌న్న‌ర కాలంగా కేసీఆర్ వెన్నంటి ఉండ‌టంతో పాటు తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో చురుకైన పాత్ర పోషించిన సంతోష్ కుమార్ కు బెర్తు ఖ‌యమ‌ని పార్టీ సినియ‌ర్ నేత ఒక‌రు తెలిపారు. కేసీఆర్ ఖ‌మ్మంలో నిర్వ‌హించిన నిరాహార దీక్ష సంద‌ర్బంలోనూ, నిమ్స్ లో నిర్వ‌హించిన అమ‌ర‌ణ దీక్ష లోనూ  సంతోష్ కుమార్ ఆయ‌నతో పాటే ఉన్నారు. పార్టీలో మంత్రులు, ఏమ్మెల్యే ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం చేయ‌డంలో సంతోష్ కుమార్ కు  మంచి   అనుభ‌వం  ఉంది. దీనికి తోడు ఆయ‌న్ను రాజ్య‌స‌భ‌కు పంపాలంటూ పార్టీలోని ఎంపీలు సీఎం కేసీఆర్ పై ఒత్తిడి తెస్తున్న‌ట్లు స‌మ‌చారం.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.