మ‌హాకూట‌మిలో సీట్ల‌కోసం కుమ్ములాట‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana politics
Updated:  2018-09-26 10:42:59

మ‌హాకూట‌మిలో సీట్ల‌కోసం కుమ్ములాట‌

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి అధ్య‌క్షుడు ముఖ్య‌మ‌త్రి కేసీఆర్ త‌మ పార్టీ త‌ర‌పున సుమారు 105 అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి ఎన్నిక‌ల ప్ర‌చారం కూడా చేస్తున్నారు. అయితే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఇంత‌వ‌ర‌కు అభ్య‌ర్థుల‌ను ప్రక‌టించ‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మ‌హాకూట‌మికి పిలుపునిచ్చారు.
 
ఈ మ‌హాకుట‌మిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాల‌నే దాని విష‌యంలో ప్ర‌స్తుతం స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎక్క‌వ సీట్ల కోసం పార్టీలు ప‌ట్టుబ‌డుతున్నాయి. సీపీఐ 12 సీట్లు అడుగుతుంటే మ‌రోవైపు తెలుగుదేశం పార్టీ నాయ‌కులు 19 సీట్ల జాబితాను ఇచ్చింది. దీంతో ఇర‌కాటంలో ప‌డింది కాంగ్రెస్ పార్టీ.
 
టీజేఎస్, సీపీఐకి చెరో మూడు సీట్లు టీడీపీకి 10 నుంచి 12 సీట్లు ఇవ్వాల‌ని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. కానీ టీజేఎస్ మాత్రం త‌మ‌కు 25 సీట్లు కావాల‌ని ప‌ట్టుబ‌డుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ క‌నీసం వంద సీట్ల‌లో పోటీ చెయ్యాల‌ని భావిస్తున్న త‌రుణంలో ఇప్పుడు పెద్ద స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.