బ్రేకింగ్ ఎన్నిక‌ల విష‌యంలో కేసీఆర్ కు చుక్కెదురు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-08-25 17:18:39

బ్రేకింగ్ ఎన్నిక‌ల విష‌యంలో కేసీఆర్ కు చుక్కెదురు

ముంద‌స్తు ఎన్నికల గురించి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్న వేళ  ఊహించ‌ని రీతిలో స్పీడ్ బ్రేక్ ఒక‌టి అడ్డువ‌చ్చింది. ఏపీలో పోల‌వ‌రం ప్రాజెక్ట్ క‌డితే తెలంగాణ‌లో ఏడు మండ‌లాలు ముంపునకు గురి అయ్యే అవ‌కాశం ఉంద‌ని విభ‌జ‌న చ‌ట్టంతో తేల్చారు. 2014లో న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఏపీ విజ్ఞ‌ప్తి మేర‌కు క‌మ్మం జిల్లాలోని ఏడు మండ‌లాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌లిపారు.
 
 భ‌ద్రాచ‌లం అశ్వ‌రావు పేట పిన‌పాక నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న కుక‌నూరు, వేలూరుపాడు, వ‌ర రామ‌చంద్రాపురం, చింతూరు, కోన‌వ‌రం దుర్గంపాడ తో పాటుగా ఆల‌య ప్రాంతం మిన‌హా భ‌ద్రాచ‌లం ఏపీలో క‌లిశాయి. నాడు క్యాబినెట్ ముద్ర‌వేడం ఆ వెంట‌నే పార్ల‌మెంట్ లో కూడా దీనికి సంబంధించిన వ్య‌వ‌హారాన్ని తేల్చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అయితే రాష్ట్ర ప‌తి గెజిట్ మాత్రం విడుద‌ల కాలేదు.
 
ఇక ఈ గెజిట్ రాక‌పోవ‌డంతో ఎన్నిక‌ల సంఘం కూడా ఓట‌ర్ల జాభితాను ఎలాంటి మార్పులు చేయ‌లేదు. ఈసీ లెక్క‌ల ప్ర‌కారం ఈ ఏడు మండ‌లాలు తెలంగాణ ప‌రిధిలో ఉన్నాయి, కేద్రం వెంట‌నే గెజిట్ ఇస్తే ఈ ఏడు మండ‌లాల‌ను మిన‌హాయించి ఆ మేర‌కు ఓట‌ర్ల జాబితా లీస్ట్ ను త‌యారు చేయ‌నుంది ఈసీ. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌మ్మం జిల్లాలోని భ‌ద్రాచ‌లం నియోజ‌క‌వ‌ర్గం నుంచి సీపీఎం త‌ర‌పున సున్నం రాజ‌య్య అశ్వ‌రావు పేట‌నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి తాటి వెంక‌టేశ్వ‌ర్లు, అలాగే పెన‌పాక నుంచి వైసీపీ వెంక‌టేశ్వ‌ర్లు ఎన్నిక‌య్యారు. 
 
2014 ఏప్రెల్ 30న ఎన్నిక‌లు ఉమ్మ‌డి రాష్ట్రంలోనే జ‌రిగాయి. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోని మండ‌లాలు ఏపీలో ఎన్నిక‌లు  జ‌రుగ‌డంతో ఇన్నాళ్లు ఎమ్మెల్యేలు తెలంగాణ‌లో.. మండ‌లాలు ఏపీలో ఉండిపోయాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు దీన్ని పెద్ద‌గా ఎవ్వ‌రు ప‌ట్టించ‌క‌పోయినా ఎన్నిక‌ల వేళ మ‌ళ్లి తెర‌పైకి వ‌చ్చింది. ఒక స‌మ‌యంలో ఈ ముంపు మండ‌లాల ప్ర‌జ‌ల‌కు ఎమ్మెల్యేలు ఎవ‌రు అనేది చ‌ర్చ జ‌రిగింది. 
 
ప్ర‌జ‌లు త‌మ‌ను న‌మ్మి ఓట్లు వేశార‌ని వారి స‌మ‌స్య‌ను ప్ర‌స్తావించ‌వ‌ల్సిన భాద్య‌త త‌మ‌పై ఉంద‌ని ముగ్గురు ఎమ్మెల్యేలు గ‌తంలో గ‌వ‌ర్న‌ర్ ను కూడా క‌లిశారు. త‌మ‌ను రెండు రాష్ట్రాల‌కు ప్ర‌క‌టించాల‌ని కేంద్రాన్ని కూడా కోరారు. ఆ త‌ర్వాత రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్నిఆశ్రయించారు. అయితే ఎందుకో ఏమో ఈ విష‌యంలో అడుగు ముందుకు ప‌డ‌లేదు. 
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.