పాప లెట‌ర్ కి కేటిఆర్ ఫిదా

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-19 12:55:27

పాప లెట‌ర్ కి కేటిఆర్ ఫిదా

తెలంగాణ రాష్ట్ర ఐ.టీ శాఖ మంత్రి కేటీఆర్ ... ఈ పేరు  తెలియ‌ని వారు ఊండ‌రు..... ప్ర‌తిప‌క్ష పార్టీలు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా.... ఆయ‌న అవి ఏవీ ప‌ట్టించుకోకుండా  నిత్యం రాష్ట్ర అబివృద్ది కోసం పాటుప‌డుతూ... ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ.... వాటిని ప‌రిష్కారిస్తూ.... ముందుకు దూసుకెళ్తున్నారు. అలాగే ఆయ‌న ఏన్నో స‌మ‌స్య‌లు ప్ర‌త్య‌క్షంగానూ..... ప‌రోక్షంగానూ (ట్వీట‌ర్ ద్వారా తెలుసుకుని) ప‌రిష్కారించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.
 
అలాగే ఇటీవ‌ల ఆయ‌న‌కు ఒక పాప ఓ స‌మ‌స్య పై త‌న తండ్రి ద్వారా మంత్రి గారికి ట్విట్ చేయ‌డం జ‌రిగింది. ఆ ట్విట్ చూసిన కేటిఆర్  ఫిదా అయ్యారు. డియ‌ర్ కేటీఆర్ అంకుల్.... నేను సుప్రియ‌ను 6 సంవ‌త్స‌రాలు అంటూ.... త‌ను చ‌దువుతున్న డిటైల్స్ లో పాటు...తాను ఉండే ఏరియాలోని సూచిత్ర జంక్ష‌న్ చిన్న పిల్ల‌ల‌లు అడుక్కుంటున్నారు.....వారికి హెల్ప్ చేయ‌మ‌ని కేటీఆర్ ని వేడుకుంది సుప్రీయ‌. అంతే కాదు అందుకోసం త‌న కిడ్డి బ్యాంకులో దాచుకున్న రూ.2000 ని ఇచ్చేస్తాన‌ని కూడా తెలిపింది.
telngana it minister ktr
 
ఈ పాప లెట‌ర్ ని వాళ్ల  నాన్న కేటీఆర్ కి షేర్ చేశారు. ఈ లెట‌ర్ చ‌దివిన కేటీఆర్ రియాక్ట్ అవుతూ... ఆ పాప పై కేటీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ లెట‌ర్ షేర్ చేసిన ఆ పాప వాళ్ల  నాన్న‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన కేటీఆర్...! పాప‌కు వ‌చ్చిన ఆలోచ‌న చాలా గొప్ప‌ద‌ని, ఆ పాప చెప్పిన వారి ప‌ట్ల ఖ‌చ్చితంగా కేర్ తీసుకుంటామ‌ని, ఆ చిట్టి త‌ల్లి కిడ్డీ బ్యాంకు సెవింగ్స్ ఇస్తాన‌ని చెప్ప‌డం చాలా న‌చ్చింద‌ని కేటీఆర్ త‌న ట్వీట‌ర్ ద్వారా తెలిపారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.