2019లో టీ కాంగ్రెస్ పోటీ అభ్య‌ర్దులు ఖ‌రారు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

congress
Updated:  2018-09-07 10:38:45

2019లో టీ కాంగ్రెస్ పోటీ అభ్య‌ర్దులు ఖ‌రారు

తెలంగాణ‌ రాష్ట్ర రాజ‌కీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. తాజాగా అసెంబ్లీ రద్దు అయిన నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిపించేందుకు స‌ర్వం సిద్దం చేసుకున్నారు. ఇదే క్ర‌మంలో కేసీఆర్ తాజాగా 2019లో పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌బోయే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఇక ప్ర‌తిపక్ష‌ కాంగ్రెస్ నాయ‌కులు కూడా త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. 
 
ఈ క్ర‌మంలో టీపీసీసీ విసృత‌స్థాయి స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశంలో ముఖ్య‌నేత‌లంతా పాల్గొని భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌పై నిర్ణ‌యం తీసుకోనున్నారు. అలాగే ఈ స‌మావేశంలో కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేయ‌బోయే అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలే అదే నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తార‌ని తెలిపిన‌ట్లు తెలుస్తోంది. అలాగే కొన్నిచోట్ల 2014లో ఓట‌మిపాలు అయిన కాంగ్రెస్ అభ్య‌ర్థులు కూడా పోటీ చేయ‌వ‌చ్చ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కొన్ని చోట్ల‌ కొత్త అభ్య‌ర్థుల‌ను నియ‌మించే ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.