తొలిజాబితాకు టీ కాంగ్రెస్ డేట్ ఫిక్స్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

t congress
Updated:  2018-11-01 11:20:08

తొలిజాబితాకు టీ కాంగ్రెస్ డేట్ ఫిక్స్

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో అధికార టీఆర్ఎస్ నాయ‌కులు 119 స్థానాల‌కుగాను 105 స్థానాల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల పేర్ల‌ను ప్ర‌క‌టించి రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌చారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తోంది. ఇక మ‌రోవైపు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ మ‌హాకూట‌మిలో భాగంగా సీట్ల స‌ర్దుబాటులో బిజీ అవుతున్నారు. అయితే క్ర‌మంలో ఢిల్లీలోని పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాసేప‌ట్లో సెంట్ర‌ల్ ఎల‌క్ష‌న్ తో భేటీ కానుంది. 
 
తెలంగాణ ఎన్నిక‌ల కోసం 54 మందితో ఇప్ప‌టికే అధిష్టానం తొలిజాబితాను సిద్దం చేసింది. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ ను ఆమోదించి మీడియా ముందు ప్ర‌క‌టించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ రోజు మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు పార్టీ వార్ రూమ్ లో స్క్రీనింగ్ క‌మిటీ స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు. భాగ‌స్వామ్య పార్టీలు, అడ‌గ‌ని స్థానాలకు అభ్య‌ర్థుల ఖ‌రారుపై స‌మాలోచ‌న చేస్తున్నారు. 
 
ఈ క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ సీట్ల స‌ర్దుబాటుపై ఇప్ప‌టికే ఓ అవ‌గాహ‌న‌ వ‌చ్చిన టీకాంగ్రెస్ 14 స్థానాలు ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఈ మేర‌కు రెండు పార్టీల మ‌ధ్య ఒప్పందం కుదిరింది. టీజేఎస్ సీపీఐ, సీపీఎమ్ ల‌కు కేటాయించాల్సిన స్థానాలు ఒక‌టి రెండు రోజుల్లో ఒప్పందం కుదిరే అవ‌కాశాలు ఉన్నాయి. 

షేర్ :