టీ-కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

t congress
Updated:  2018-09-05 11:59:29

టీ-కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు

ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ నాయ‌కుల‌తో పాటు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కూడా త‌మ స్పీడును పెంచారు. తాజాగా గాంధీ భ‌వ‌న్ లో స‌మావేశం అయిన కాంగ్రెస్ నాయ‌కులు మేనిఫెస్టో క‌మిటీతో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు హామీల విష‌యంలో క‌స‌ర‌త్తు చేస్తోంది. 
 
అయితే ఇప్ప‌టికే రెండు ల‌క్ష‌లు రైతు రుణ‌మాఫీ, నిరుద్యోగ భృతిని కాంగ్రెస్ నాయ‌కులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక వీటితో పాటు మ‌రికొన్ని అంశాల‌ను చేర్చాల్సిన స‌మ‌యంలో పార్టీ సీనియ‌ర్ల అభిప్రాయాల‌ను తీసుకుంటోంది మేనిఫెస్టో క‌మిటీ. 
 
ఈ క‌మిటీలో కొన్ని అంశాలు
 
-65 సంవ‌త్స‌రాల‌కు టీఆఎస్ ఇస్తున్న ఫించ‌న్ ప‌థ‌కాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే 58 సంవ‌త్స‌రాల‌కు కుదించిన‌ట్లు తెలుస్తోంది.  
 
- ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఇస్తున్న ఫించ‌న్‌ కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే దాన్ని డ‌బుల్ చేయ‌డం.
 
- అలాగే విక‌లాంగుల ఫించ‌న్‌ కూడా డ‌బుల్ చేస్తార‌ని తెలుస్తోంది.
 
- గృహ నిర్మాణానికి సంబంధించి కీల‌క నిర్ణ‌యం
 
- ఎస్సీ, బీసీ సంక్షేమాల‌కు విష‌యాల్ని కూడా ఇందులో చేర్చిన‌ట్లు తెలుస్తోంది.
 
- నిరుద్యోగ భృతి.
 
- రైతు రుణ‌మాఫీ

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.