ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలుసా.......

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-02-10 05:53:29

ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలుసా.......

ఆరోగ్యాన్ని ప‌ణంగా పెట్టి ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు టీఆర్‌య‌స్ అధినేత కేసీఆర్. స్వ‌రాష్ట్రం వ‌చ్చిన త‌రువాత  ఎన్నిక‌ల్లో నెగ్గి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు.  తెలంగాణ ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ధ్యేయ్యంగా సంస్క‌ర‌ణ‌లు చేస్తూ సుప‌రి పాల‌న అందిస్తున్నారు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.
 
గ‌త కొన్ని రోజులుగా ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ లేక‌పొవ‌డం వ‌ల్ల  చికిత్స కోసం దేశ రాజ‌ధానికి ప‌య‌న‌మయ్యారు. గ‌తంలో కంటికి సంబందించిన వ్యాధికి సైతం అక్క‌డే వైద్యం చేయించుకున్నారు గులాబీ బాస్.. తాజాగా పంటి నొప్పి రావ‌డంతో చికిత్స కోసం  ఢిల్లీ వెళ్లిన‌ట్లు  సీఎం క్యాంప్ కార్యాల‌యం వెల్ల‌డించింది. చికిత్స నిమిత్తం రెండు లేదా మూడు రోజులు అక్క‌డే విశ్రాంతి తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.
 
వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న మూలంగా  ప్ర‌భుత్వాధికారులెవ్వ‌రిని  తీసుకువెళ్ల‌లేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. కేసిఆర్ ప‌ర్య‌ట‌న‌తో తెలంగాణ రాజ‌కీయ పార్టీల్లో విస్తృతంగా చ‌ర్చ‌సాగుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోడి విదేశీ యాత్ర‌లో ఉండ‌టంతో, ఆయ‌న వ‌చ్చిన త‌రువాత ఇరువురి భేటీ ఉంటుంద‌ని హ‌స్తిన వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.. కేంద్ర‌ బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివ‌రించి... రైల్వే ప్రాజెక్టులు, పసుపు కర్మాగారం లాంటి అంశాల‌ను సైతం ప్ర‌ధాని దృష్టికి తీసుకువెళ్ల‌వ‌చ్చు అంటున్నారు గులాబీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.