తెలంగాణ బ‌డ్జెట్ 2018-19

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

etela rajendra image
Updated:  2018-03-15 02:20:55

తెలంగాణ బ‌డ్జెట్ 2018-19

 తెలంగాణ అసెంబ్లీలో నేడు ఆర్ధిక మంత్రి ఈట‌ల రాజేంద్ర బ‌డ్జెట్  ప్ర‌వేశ పెట్టారు.. బ‌డ్జెట్ అంచ‌నా రూ. ల‌క్షా 75వేల కోట్లు.... తెలంగాణ ఏర్ప‌డి నాలుగేళ్లు పూర్తి చేసుకున్నాం. నాలుగేళ్ల‌లో ఎన్నో మైలురాళ్ల‌ను అధిగ‌మించాం. చీక‌టి నుంచి వెలుగులోకి, అప‌న‌మ్మ‌కం నుంచి ఆత్మ‌విశ్వాసంలోకి న‌డిపిస్తున్నాం. ఐదోసారి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టిన ఆర్థిక మంత్రి ఈట‌ల... సంక్షేమ‌మే మా ఎజెండా. ఈ ఏడాది జీడీపీ 10.4 శాతం.
 
పెద్ద నోట్లర‌ద్దు వ‌ల్ల ఎదురైన స‌మ‌స్య‌లు అధిగ‌మించాం.. ఇక కేటాయింపులు చూసిన‌ట్లు అయితే 
వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ‌కు రూ. 522కోట్లు. 
బిందు, తుంప‌ర స్యేద్యం కోసం రూ 127కోట్లు.
 రైతు భీమా ప‌థ‌కానికి రూ. 500 కోట్లు . 
గ్రీన్‌హోస్‌, పాలిహోస్‌కు రూ. 120కోట్లు. 
నీటి పారుద‌ల శాఖ‌కు రూ. 25కోట్లు. 
పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు రూ.2,946కోట్లు.
క‌ళ్యాణిల‌క్ష్మి, షాదిముబార‌ఖ్ ప‌థ‌కానికి రూ.1450కోట్లు
గ్రామీణ‌, స్థానిక సంస్థ‌ల‌కు రూ.1700 కోట్లు.
రైతుల పెట్టుబ‌డి ప‌థ‌కానికి రూ. 12వేల కోట్లు.
డ‌బుళ్ల బెడ్‌రూం ఇళ్ల‌కు రూ.2,643కోట్లు
మున్సిపాలటీలు, కార్పొరేష‌న్  రూ. 1000కోట్లు.
ఈ ఏడాది నుంచే రైతుల‌కు 8వేల పెట్టుబ‌డి సాయం.
ఆర్ అండ్ బీ  శాఖ‌కు రూ.5,575కోట్లు. 
అమ్మ‌బ‌డి ప‌థ‌కానికి రూ.561కోట్లు.
ఎంబీసి కార్పొరేష‌న్‌కు రూ.1000కోట్లు. 
విద్యుత్ శాఖ‌కు రూ.5,656కోట్లు.
ఆస‌రా పెన్స‌న్ల‌కు రూ.5,300కోట్లు.
వైద్య ఆరోగ్య‌శాఖ‌కు రూ.7,375కోట్లు.
విద్యా శాఖ‌కు రూ.10,830కోట్లు
ఐటి ప‌రిశ్ర‌మ‌కు రూ.289కోట్లు.
యాదాద్రి అభివృద్దికి రూ.250కోట్లు. 
ఆరోగ్య‌ల‌క్ష్మి ప‌థ‌కానికి రూ.295కోట్లు. 
వేముల‌వాడ దేవాల‌య ప్రాదికార సంస్థ‌కు రూ.100కోట్లు. 
భ‌ద్రాచ‌లం దేవాల‌యానికి రూ.100కోట్లు. 
బాస‌ర‌కు రూ.50కోట్లు. 
ధ‌ర్మ‌పురికిరూ.50కోట్లు. 
చేనేత‌, టెక్స‌టైల్ రంగానికి 1,200కోట్లు.
కొత్త క‌లెక్ట‌రేట్‌ల‌కు ఎస్పీ కార్యాల‌యాల నిర్మాణానికి రూ.500కోట్లు. 
ఇప్ప‌టి వ‌ర‌కు 80,048 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తి చేశాం. 27,588వేల  ఉద్యోగాల భ‌ర్తికి ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. ఉద్యోగులు, పాత్రికేయుల‌కు కార్పోరేట్ ఆస్ప‌త్రుల్లో న‌గ‌దుర‌హిత వైద్యం.
ఎస్సీ రెసిడెన్సియ‌ల్స్‌కు రూ.1221కోట్లు.
ఎస్టీ రెసిడెన్సియ‌ల్స్‌కు రూ.401కోట్లు.
బిసీ రెసిడెన్సియ‌ల్స్‌కు రూ.296కోట్లు. 
మైనార్టీ రెసిడెన్సియ‌ల్స్‌కు రూ. 735కోట్లు. 
గురుకుల విద్యాల‌యాల‌కు రూ.170కోట్లు.
మొత్తంగా  రెసిడెన్సియ‌ల్స్‌సంస్థ‌ల‌కు రూ.2,824కోట్లు.
మిష‌న్ భ‌గీర‌థ‌ కోసం రూ. 1801 కోట్లు.
 
హ‌రిత‌హారం ద్వారా 80కోట్ల మొక్క‌లు నాటాం... మ‌రో40కోట్ల‌మొక్క‌లు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం... రాష్ట్ర వ్యాప్తంగా 4వేల న‌ర్స‌రీల‌ను ఏర్పాటు చేశాం. పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణానికి రూ.1080కోట్లు.....ర‌వాణా,రోడ్డు, భ‌వ‌నాల శాఖ‌కు రూ.5,575కోట్లు. ఐటిలో మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు వీ. హ‌బ్ ప్రారంభించాం. కేసీఆర్ కిట్ ప‌థ‌కంతో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప్ర‌స‌వాల సంఖ్య‌51 శాతం పెరిగింది.పాఠ‌శాల విద్య‌కు రూ.10,830కోట్లు. ఉన్న‌త విద్యా రంగానికి రూ. 2,448కోట్లు.కేటాయించారు తెలంగాణ బ‌డ్జెట్ లో.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.