కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-04-27 17:48:15

కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు త‌మ పార్టీ వార్షికోత్స‌వాన్ని !!ప్లీన‌రీ!! ఈ రోజు ఘ‌నంగా నిర్వ‌హించారు... ఈ వార్షికోత్స‌వానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజ‌రై త‌మ పార్టీని ఉద్దేశించి మాట్లాడారు...2001 ఎప్రిల్ 27 న టీఆర్ఎస్ ఆవిర్భ‌వించింద‌ని నాటి నుంచి నేటి వర‌కూ  ప్ర‌జ‌ల‌కోసం నిర‌తంరం కృషి చేస్తునే ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు... తాము చిత్త‌శుద్దితో ప‌ని చేస్తున్నాము కాబ‌ట్టి టీఆర్ఎస్ పార్టీని ప్ర‌జ‌లు గండేల్లో పెట్టుకుని చూసుకుంటున్నార‌ని కేసీఆర్ ఆన్నారు.
 
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్నానని, తిరిగి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ గడ్డమీదే అడుగుపెడతానని చెప్పి అలానే చేశానని మ‌రోసారి గుర్తు చేశారు కేసీఆర్ .... తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఒక్క టీఆర్ఎస్ పార్టీనేనే స్పష్టం చేశారు... ప్ర‌జ‌లు వాళ్ల గుండెను తీసి టీఆర్‌ఎస్‌ చేతిలో పెట్టారని, అందుకు ప్రతిగా నీతి, నిజాయితీగా నోరు, కడుపు కట్టుకుని పని చేస్తున్నామ‌ని అన్నారు.
 
ఇక‌ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి కేసీఆర్ సంచ‌ల‌న స‌వాల్ విసిరారు..  తాను ప్రగతి భవన్ లో  50 నుంచి 100 గదులతో ప్రగతి భవన్‌ కట్టుకున్నాన‌ని యాత్ర చేస్తూ చెబుతున్నారని అన్నారు సీఎం కేసీఆర్ ... అయితే ఉత్తమ్‌ కు ఇదే నా సవాల్‌... మొత్తం మీడియాను తీసుకుని నువ్వు ప్రగతిభవన్ కు రా. 15 గదుల కంటే ఎక్కువ లేకపోతే అక్కడే నీ ముక్కును నేలకు రాసి వెళ్లాలి... ఒక‌వేల 16 గదులు ఉంటే నేను ముఖ్యమంత్రి పదవికి  రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసిరారు కేసీఆర్.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.