సంచ‌ల‌నం రేపుతున్న కేసిఆర్ వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr chandrababu naidu image
Updated:  2018-03-04 10:40:00

సంచ‌ల‌నం రేపుతున్న కేసిఆర్ వ్యాఖ్య‌లు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు దేశ రాజ‌కీయాల్లోనే సంచ‌ల‌నంగా మారింది. మ‌న దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం, ఇప్పుడు అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ.....ప్ర‌జ‌లకు  చేసేంది ఏమీ లేద‌ని, ఈ రెండు పార్టీల‌కు ప్ర‌త్య‌మ్నాయంగా మ‌రో కూట‌మి ఏర్పాటు కావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని అన్నారు కేసిఆర్. 
 
అవ‌స‌ర‌మైతే ఆ కూట‌మికి తానే ప్రాతినిద్యం వ‌హించేందుకు కూడా సిద్దంగా ఉన్నాన‌ని కేసిఆర్ కీల‌క ప్ర‌క‌న‌ట చేశారు. ఈ కూట‌మిని ధ‌ర్డ‌ఫ్రంట్ అయినా అనుకోవ‌చ్చు.... మ‌రేదైనా అనుకోవ‌చ్చని అన్నారు. మ‌రోవైపు ఆయ‌న  ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోదీ పై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. 
 
కేసిఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న కూతురు ఎంపీ క‌విత‌తో పాటు, మంత్రి కేటిఆర్ కూడా స‌మర్ధించుకోవ‌డం జ‌రిగింది. అయితే బీజేపీ నేత‌లు మాత్రం కేసిఆర్ ను జైలుకు పంపిస్తాం జాగ్ర‌త్త అంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో మున్ముందు కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌తిరేకంగా మారే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. 
 
మ‌రోవైపు ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంపై కూడా కేసిఆర్ త‌న‌దైన శైలిలో స్పందించారు. ఏపీకి హోదా ఇస్తే ఇస్తామ‌ని,లేదంటే ఇవ్వ‌మ‌ని చెప్పండంటూ కేసిఆర్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో  ప్ర‌భుత్వాలు కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.