అక్క‌డ నుంచే కేసీఆర్ పోటీ

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-30 01:09:18

అక్క‌డ నుంచే కేసీఆర్ పోటీ

తెలంగాణ‌లో గులాబీ పార్టీపైనే ఫోక‌స్ చేసింది కాంగ్రెస్ పార్టీ... అస‌లు ప్ర‌స్తుతం కాంగ్రెస్ లో ఎన్ని గ్రూపులు ఎన్ని రాజ‌కీయాలు ఉన్నాయి అనేది ఆ పీసీసీ కే తెలియ‌దు.. అయినా గులాబీ పార్టీ పైన సీఎం కేసీఆర్ పైన హ‌స్తం పార్టీ టార్గెట్ అని తెలుస్తోంది.. ఇటు రేవంత్ పార్టీలోకి వ‌చ్చిన త‌ర్వాత... ఈ విమ‌ర్శ‌ల జోరు మ‌రింత పెరింగింది అనేది తెలిసిందే.

ఇక ఎన్నిక‌ల‌కు మ‌రో సంవ‌త్స‌రం స‌మ‌యం ఉంది... అయితే ఇప్ప‌టి నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల కోసం రాజ‌కీయ ఎత్తులు వేస్తున్నారు నాయ‌కులు.. పొత్తుల పై పార్టీ నిర్ణ‌యాల‌పై స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. అయితే వ‌చ్చేది జ‌మిలి ఎన్నిక‌లు అయినా, తాము సిద్ద‌మే అని ఇటు తెలంగాణ‌లో టీఆర్ ఎస్ తెలుపుతోంది.....ఇప్ప‌టికే 119 నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఫోక‌స్ పెట్టింది కారు పార్టీ . నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఎవ‌రెవ‌రికి టికెట్లు ఇవ్వాలి? సిట్టింగ్ ఎమ్మెల్యేల బ‌లం ఏంటి? మ‌ళ్లీ గెలుస్తారా? లేదా అనే అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఆరాతీస్తున్నారు సీఎం కేసీఆర్.. సర్వేలు కూడా చేయిస్తున్నారు నాయ‌కుల‌పై.

2014 ఎన్నిక‌ల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా..మెద‌క్ నుంచి ఎంపీగా పోటీ చేశారు సీఎం కేసీఆర్... కాని ఈ సారి పోటీ వేరే చోట నుంచి చేస్తారు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి.. ఆయ‌న సిద్ధిపేట నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఈ విష‌యం ఇప్ప‌డు గులాబీ స‌ర్కిల్స్ లో గులాబీలిస్తోంది. రాజకీయాల‌ను ఆయ‌న సిద్దిపేట నుంచి స్టార్ట్ చేశారు.. అందుకే ఈ సారి ఇక్క‌డ నుంచి రాజ‌కీయంగా నిల‌బ‌డాలి అని చూస్తున్నారు.. మ‌రి ఇప్పుడు కేసీఆర్ సిద్దిపేట‌కు వ‌స్తే హ‌రీష్ రావు ఎక్క‌డ నుంచి పోటీ చేస్తారు, అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆయన ప‌క్క‌నే ఉన్న హుస్నాబాద్ నుంచి పోటీకి దిగుతార‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.