కేసీఆర్ మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ తో కీల‌క భేటీ

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr and governor
Updated:  2018-09-26 05:51:04

కేసీఆర్ మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ తో కీల‌క భేటీ

రేపు శాస‌న‌మండ‌లి స‌మావేశం జ‌రుగుతున్న క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర‌స‌మితి అధ్య‌క్షుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో భేటీ అయ్యారు. ఈ భేటిలో మండ‌లి స‌మావేశాలు తాజా రాజ‌కీయ పరిణామాల గురించి చ‌ర్చిన‌ట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ర‌ద్దు చేసి సెప్టెంబ‌ర్ 6 త‌ర్వాత ఈమ‌ధ్య‌కాలంలో ఎక్కువ స‌మ‌యం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఫామౌస్ లో గ‌డుపుతున్నారు. 
 
నిన్న సాయంత్రం హైద‌రాబాద్ చేరుకుని ఈ రోజు మ‌ధ్యాహ్నం రాజ్ భ‌వ‌న్ లో గ‌వ‌ర్న‌ర్ ను క‌లిశారు. ఈ స‌మావేశం దాదాపు అరగంట పాటు సాగింది. మండ‌లి స‌మావేశాలు ఎందుకు నిర్వ‌హిస్తున్నార‌నే దానిపైన గ‌ర్న‌ర్ కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మాచారం ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది. అంతేకాదు రాజ‌కీయ ప‌ర‌మైన అంశాలు కూడా ఇద్ద‌రి చ‌ర్చ‌లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.
 
 ఇక మ‌రో వైపు కేసీఆర్ త‌న‌కు అందుబాటులో ఉన్న నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుతున్న ప్ర‌చార స‌ర‌ళీ అసంతృప్తుల వ్య‌వ‌హారం గురించి ఆయ‌న ఆరాతీసినట్లు స‌మాచారం. అలాగే అక్టోబ‌ర్ 3 నుంచి జ‌రిగి ప్ర‌చారానికి భారీగా జ‌న స‌మీక‌ర‌ణ చెయ్యాల‌ని అధినేత పార్టీ నేత‌ల‌కు సూచించారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.