అధికార ద‌ర్పం మంత్రి త‌ల‌కెక్కింది

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

minister tummala nageswara rao
Updated:  2018-08-23 11:47:53

అధికార ద‌ర్పం మంత్రి త‌ల‌కెక్కింది

టీఆర్ఎస్ నేత‌లు తీరుతో ఆ పార్టీ అధినేత  సీఎం కేసీఆర్ కు త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతోంది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌జ‌ల‌తో వ్య‌వ‌హ‌రించే తీరు ఏమాత్రం రుచించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.  
 
కొద్దిరోజుల క్రితం క‌రీంన‌గ‌ర్ కోదండ‌రామ ఆల‌య చైర్మ‌న్, మంత్రి ఈటెల రాజేంద‌ర్ అనుచ‌రుడు సంజీవ‌ర్ రెడ్డి పై  లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. సంజీవ్ రెడ్డి త‌న‌ని లైంగిక వేధిస్తున్నారంటూ ఓ మ‌హిళా పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. న్యాయం చేయాలంటూ మంత్రి ఈటెల ఇంటి ముందు ధ‌ర్నాకు దిగింది. అంతేకాదు త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న స‌మ‌యంలో మంత్రిని సంజీవ్ రెడ్డి ఫోన్ లో దూర్భ‌ష‌లాడిన  ఆడియో టేపుల్ని  స‌ద‌రు మ‌హిళ విడుద‌ల చేసింది. ఈ వ్య‌వ‌హారం మంత్రి ఈటెల రాజేంద‌ర్ కు తొల‌నొప్పిగా మారింది. అంతేకాదు లైంగిక వేదింపుల ఆడియో టేపులు పార్టీ అధినేత వ‌ద్ద‌కు వెళ్లిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు గుప్పు మ‌న్నాయి. 
 
దీన్ని అస్త్రం గా మ‌లుచుకున్న ప్ర‌తిప‌క్షాలు మంత్రి ఈటెల రాజేంద‌ర్, సంజీవ్ రెడ్డిల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ధ‌ర్నా చేప‌ట్టాయి. దిష్టిబొమ్మ‌ను ద‌గ్ధం చేశాయి. ఇక  తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు వివాదాల్లో ఎప్పుడూ ముందుంటారు. డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుల్లో అక్ర‌మాలు, కూలీలుపై దూర్భాష‌లాడటం, పుష్క‌రాల స‌మ‌యంలో మీరు ఆంధ్రా అధికారులా అంటూ వారిని అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించ‌డంతో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.
 
తాజాగా మంత్రి తుమ్మ‌లతో వికలాంగుల సంఘాల ఐక్య వేదిక నాయకులు కలిశారు.ప‌లు స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించి..ఉపాది అకాశాలు క‌ల్పించాల‌ని విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. అదే స‌మ‌యంలో దివ్యాంగుల  ప‌ట్ల మంత్రి తుమ్మ‌ల వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదానికి దారితీసింది. అస‌లే విక‌లాంగులు. ఆదుకోవాలంటూ వ‌చ్చిన వారిప‌ట్ల క‌నిక‌రం, ద‌య చూపించాలి. కానీ అలా జ‌ర‌గ‌లేదు. మంత్రి గారు వారి ముఖం మీద కాలు ఉండేలా కాలు మీద కాలేసుకుని వినతిపత్రం తీసుకున్నారు. దీనిపై పీసీసీ వికలాంగుల విభాగం ఛైర్మన్ ముత్తినేని వీరయ్య మండిప‌డ్డారు.    
 
నీసం కూర్చోనమనకుండా , తనైన లేచి వినతి పత్రం స్వీకరించ కుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం , ఆ కాలు వికలాంగుల మొఖానికి చూపిస్తూ అహంకార ధర్పం ప్రదర్శిస్తూ, వెటకారంగా మాట్లాడుతూ వినతి పత్రం స్వీకరించడం సిగ్గుచేటు, సమాజం తలదించుకునేలా ఉందన్నారు .

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.