జ‌గ‌న్ కోసం తెలంగాణ పోలీసులు కొత్త నిర్ణ‌యం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

ys jagan
Updated:  2018-11-06 12:25:25

జ‌గ‌న్ కోసం తెలంగాణ పోలీసులు కొత్త నిర్ణ‌యం

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విశాఖ విమాశ్ర‌యంలో శ్రీనివాస‌రావు అనే వ్య‌క్తి హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీందో తెలంగాణ స‌ర్కార్ జ‌గ‌న్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న చేసిన‌ప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాన్ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే క్ర‌మంలో పోలీస్ అధికారులు మ‌రో కొత్త నిర్ణయం తీసుకున్నారు. 
 
జ‌గ‌న్ న‌గ‌రంలో ప్రయాణం చేస్తున్న స‌మ‌యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చెయ్యాల‌ని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. కాన్వాయ్ లో జ‌గ‌న్ వేగంగా త‌న గ‌మ్యాన్ని చేరుకుంటున్న స‌మ‌యంలో ట్రాఫిక్ రూట్ క్లియ‌ర్ చెసేందుకు స‌హ‌క‌రించ‌నుందని స్ప‌ష్టం చేసింది. 
 
ప్ర‌స్తుతం వీవీఐపీలు హైద‌రాబాద్ కు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ఉమ్మ‌డి తెలుగురాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహన్ కు, అలాగే ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు, హోం మంత్రి నాయిని న‌ర‌సింహా రెడ్డికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌దిత‌రుల‌కు మాత్ర‌మే రూట్ క్లియ‌రెన్స్ అమ‌లు అవుతుండ‌గా ఈ జాబితాలో జ‌గ‌న్ మోహ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా చేరారు. అయితే ఆయ‌న కాన్వాయ్ కు ఎలాంటి ఆంక్ష‌లు విధించ‌మ‌ని కేవ‌లం కాన్వాయ్ రూల్ క్లియ‌ర్ చేస్తామ‌ని అలాగే భ‌ద్ర‌త కూడా పెంచుతామ‌ని తెలంగాణ పోలీస్ అధికారులు వెల్ల‌డించారు.

షేర్ :

Comments

0 Comment