19 స్థానాల్లో టీడీపీ పోటీ అభ్య‌ర్ధుల లిస్ట్ ఇదే

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

tdp and congress
Updated:  2018-09-22 13:26:15

19 స్థానాల్లో టీడీపీ పోటీ అభ్య‌ర్ధుల లిస్ట్ ఇదే

తెలంగాణ ముఖ్య‌మంత్రి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రిపించ‌నున్న నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆయ‌న త‌మ పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌బోయే 105 మంది అభ్య‌ర్ధ‌ల పేర్ల‌ను మీడియా ముందు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. అయితే ఇదే క్ర‌మంలో వ‌చ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తున్నారు. 
 
అందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల‌ను మ‌హాకూట‌మికి ఆహ్వానించింది. ఈ ఆహ్వానంలో భాగంగా సీట్ల స‌ర్దుబాటు ఒక కొలిక్కి వ‌చ్చింది. టీడీపీ తాము పోటీ చెయ్యాల‌నుకుంటున్న 19 నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ అభ్య‌ర్ధుల‌ను కాంగ్రెస్ పార్టీకి వివ‌రించింది. 
 
అంతేకాదు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ బ‌లంగా ఉంద‌ని తెలిస్తే ఆ సెగ్మెంట్ టీడీపీ త‌ర‌పున త‌మ అభ్య‌ర్థిని నిల‌బెడ‌తామ‌ని స్ప‌ష్టం చేసింది. పార్టీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేయ‌బోయే అభ్య‌ర్థుల‌ను టీడీపీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అంద‌జేశారు.
 
అభ్య‌ర్ధులు వీరే...
 
కోరుట్ల - ఎల్. రమణ (టీటీడీపీ అధ్యక్షుడు)
 
కూకట్ పల్లి - శ్రీనివాసరావు (జీహెచ్ఎంసీ టీడీపీ ఏకైక కార్పొరేటర్) 
 
సికింద్రాబాద్ - కూన వెంకటేష్ గౌడ్
 
ఉప్పల్ - వీరేందర్ గౌడ్
 
ఖైరతాబాద్ - బీఎన్ రెడ్డి (టీఎన్టీయూసీ అధ్యక్షుడు)
 
మక్తల్ - కొత్తకోట దయాకర్ (మాజీ ఎమ్మెల్యే, ఎంపీ)
 
రాజేంద్రనగర్ - ఎం. భూపాల్ రెడ్డి
 
శేరిలింగంపల్లి - మండవ వెంకటేశ్వర రావు లేదా మొవ్వా సత్యనారాయణ
 
కంటోన్మెంట్ - ఎంఎన్ శ్రీనివాసరావు (గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు)
 
ఆర్మూర్ - ఆలేటి అన్నపూర్ణ (మాజీ ఎమ్మెల్యే)
 
హుజూరాబాద్ - ఇనగాల పెద్దిరెడ్డి (మాజీ మంత్రి)
 
ఆలేరు - శోభారాణి (టీటీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు)
 
కోదాడ - బొల్లం మల్లయ్య యాదవ్
 
పరకాల / వరంగల్ వెస్ట్ - రేవూరి ప్రకాశ్ రెడ్డి
 
మిర్యాలగూడ - శ్రీనివాస్ (వ్యాపారవేత్త)
 
ఖమ్మం - నామా నాగేశ్వరరావు
 
సత్తుపల్లి - సండ్ర వెంకట వీరయ్య
 
దేవరకద్ర - రావుల చంద్రశేఖర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే, ఎంపీ)
 
మహబూబ్ నగర్ - చంద్రశేఖర్
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.