కాంగ్రెస్ నాయ‌కుల‌కు త‌ల‌సాని సంచ‌ల‌న స‌వాల్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

thalasani srinivas yadav
Updated:  2018-06-15 18:05:53

కాంగ్రెస్ నాయ‌కుల‌కు త‌ల‌సాని సంచ‌ల‌న స‌వాల్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌తో పాటు, అటు తెలంగాణ రాజ‌కీయాలు కూడా హాట్ హాట్ గా మారుతున్నాయి. రానున్న‌ ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ త‌మ పార్టీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని టీఆర్ఎస్ నాయ‌కులు జోస్యం చేబుతుంటే, ఇక మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీనే 2019లో అధికారంలోకి వ‌స్తుంద‌ని ప్రెస్ మీట్లు పెట్టి మ‌రీ చేబుతున్నారు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నాయ‌కులు. ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుందో తెలియ‌దుకానీ వీరి విమ‌ర్శ‌లుకు మాత్రం అడ్డు ఆపు లేకుండా పోతోంది.
 
అయితే ఇదే క్ర‌మంలో మ‌రోసారి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ నాయ‌కుల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఖచ్చితంగా త‌మ పార్టీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని త‌ల‌సాని జోస్యం చెప్పారు.
 
రాష్ట్ర‌విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత తెలంగాణ‌లో 119 అసెంబ్లీ సీట్లు ఉన్నాయ‌ని అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ 100 పైగా సీట్ల‌ను సాదిస్తాద‌ని త‌మ నాయ‌కుడు కేసీఆర్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అవుతార‌ని  త‌ల‌సాని దీమా వ్య‌క్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల్లో టీఆర్ఎస్‌ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరిగిపోతోందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి వస్తోన్న ఆదరణను ఓర్వలేక కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కాంగ్రెస్ నేతలు గెలవలేరని సవాల్ విసిరారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.