టీఆర్ఎస్ పార్టీలో రెబ‌ల్స్ ర‌గ‌డ‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

trs
Updated:  2018-10-02 11:34:08

టీఆర్ఎస్ పార్టీలో రెబ‌ల్స్ ర‌గ‌డ‌

తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌రంలో పార్టీల‌న్ని ఇంకా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం ద‌గ్గరే కిందా మీదా ప‌డుతున్నాయి. కానీ టీఆర్ఎస్ మాత్రం 105 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసింది. అంతేకాదు వారు ప్ర‌చార ప‌ర్వాన్ని కూడా మొద‌లు పెట్టేశారు. అయితే ఇది టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు క‌లిసివ‌చ్చే అంశ‌మే. కేసీఆర్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో రెబ‌ల్స్ బెడ‌ద‌కూడా వెంటాడుతోంద‌ట‌.
 
రామ‌గుండం నుంచి మ‌రోసారి పోటీకి రెడీ అయిన సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ‌కు ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు చ‌మ‌టు ప‌ట్టిస్తున్నార‌ట‌. నిజానికి స‌త్య‌నారాయ‌ణ‌ తొలిసారిగి ఎమ్మెల్యేగా గెలిచింది ఇండిపెండెట్ గానే.. 2009 ఆయ‌న స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి ఆయ‌న విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత ఆయ‌న కారు ఎక్కారు. అయితే ఇప్పుడు అదే స‌త్య‌నారాయ‌ణ‌కు ఇండిపెండెంట్స్ ద‌డ పుట్టిస్తున్నార‌ట‌. 
 
పైగా వారు టీఆర్ఎస్ రెబ‌ల్స్ కావ‌డం మ‌రింత‌గా కంగారు రేపుతున్నాయి. రామ‌గుండం నుంచి ఈ సారి టీఆర్ఎస్ త‌ర‌పున భ‌రిలోకి దిగాల‌ని మ‌రో నాయ‌కుడు చంద‌ర్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారట‌. కానీ కేసీఆర్ సోమార‌పు వైపు మొగ్గుచూపారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇండిపెండెంంట్ గా పోటీచేసి కేవ‌లం రెండువేల ఓట్ల తేడాతో ఓట‌మిపాలు అయ్యారు చందర్. 
 
ఆ త‌ర్వాత ఆయ‌న కూడా గులాభీ తీర్థం తీసుకున్నారు. గ‌తంలో టికెట్ కోసం ప్ర‌య‌త్నించి విఫ‌లం అయిన చంద‌ర్ తిరిగి స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి త‌న స‌త్తా చాటాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇక మ‌రోవైపు రామ గుండం జెడ్పీటీసీ స‌భ్యురాలు కందుల సంధ్య‌రాణి కూడా ఈసారి టికెట్ ఆశించార‌ట‌. కానీ నిరాశ ఎదురుకావ‌ డంతో ఆమెకూడా ఇండిపెండెంట్ గా భ‌రిలోకి దిగే ఆలోచ‌ల‌న‌లో ఉన్నార‌ట‌. 
 
ఇక మ‌రోవైపు మాజీ మేయ‌ర్ ల‌క్ష్మీ నారాయ‌ణ మాజీ డిప్యూటీ మేయ‌ర్ శంక‌ర్ కూడా స‌త్య‌నారాయ‌ణ‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నార‌ట‌. వ‌చ్చేఎన్నికల్లో ఆయ‌న‌ను ఓడించి తీరుతామన్న రీతిలో  సొంత పార్టీ నాయ‌కులు పావులు క‌దుపుతున్నార‌ట‌. ఒక వైపు అసంమ్మ‌తి పోరు మ‌రోవైపు రెబ‌ల్స్ బెడ‌ద ఈ రెండు స‌మ‌స్య‌ల‌ని అదిగ‌మించి ఆ త‌ర్వాత ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఢీ కోట్టాల్సిన ప‌రిస్థితి సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ‌కు ఏర్ప‌డింద‌ట‌. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.