టీజేఎస్ అభ్య‌ర్థుల పోటీ స్థానాల లిస్ట్ లీక్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

tjs
Updated:  2018-10-16 05:13:12

టీజేఎస్ అభ్య‌ర్థుల పోటీ స్థానాల లిస్ట్ లీక్

తెలంగాణ‌లో ముందస్తు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీ నాయ‌కులు ప్ర‌చారం దిశ‌గా ముందుకు సాగుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ఎన్నిక‌లు మ్యానిఫెస్టోని కూడా ద‌స‌రా పండగ త‌ర్వాత పార్టీ అధినేత ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించ‌నున్నారు. ఈ మేర‌కు మ్యానిఫెస్టో క‌మిటీతో  కీల‌క స‌మావేశం కూడా నిర్వ‌హించారు.
 
ఇక మ‌రో వైపు ప్ర‌తిప‌క్ష పార్టీలు సీట్ల స‌ర్దుబాటులో బిజీ అయిపోయారు. ఎప్ప‌టినుంచో సీట్ల విష‌యంలో స్ప‌ష్ట‌త‌కోరుతున్న తెలంగాణ జ‌న‌స‌మితితో కాంగ్రెస్ మంత‌నాలు చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మపార్టీకి క‌నీసం 12 సీట్లు అయినా కావాల్సిందేన‌ని టీజేఎస్ ప‌ట్టుప‌డుతుండ‌గా 8 సీట్లు ఇవ్వ‌గ‌ల‌మ‌ని కాంగ్రెస్ అధిష్టానం చెబుతున్న‌ట్లుగా తెలుస్తోంది. 
 
ఓ వైపు సంప్ర‌దింపులు జ‌రుగుతుండ‌గానే మ‌రో వైపు టీజేఎస్ కోరిన లిస్ట్ లీక్ అయింది. వ‌రంగ‌ల్ ఈస్ట్, మీర్యాల గూడా, మ‌ల్కాజ్ గిరి, పెద్ద‌ప‌ల్లి, రామ‌గుండం, మ‌హ‌బూబాబాద్,అశ్వ‌రావుపేట‌, మ‌ల‌క్ పేట్, నాంప‌ల్లి, అంబ‌ర్ పేట్ ఖైర‌తాబాద్,జూబ్లీహిల్స్, ముథోల్,మ‌హ‌బూబ్ న‌గ‌ర్, జ‌డ్చ‌ర్ల‌లో 12 సీట్లు కావాల‌ని టీజేఎస్ అడుగుతున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతుంది.