కేసీఆర్ కంచుకోట‌లో ఆ మూడు సీట్లు గెలుపు క‌ష్టం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana cm kcr
Updated:  2018-07-27 12:22:47

కేసీఆర్ కంచుకోట‌లో ఆ మూడు సీట్లు గెలుపు క‌ష్టం

ఉత్త‌ర తెలంగాణ‌లో నిజామాబాద్ రాజ‌కీయం మొద‌టి నుంచి సంచ‌ల‌న‌మే... ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌గా ఉంది ఈ జిల్లా. 1999లో ఒక్క బాల్ కొండ మిన‌హా మిగిలిన ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల‌ను గ‌తంలో గెలుచుకున్న చ‌రిత్ర టీడీపీది. అయితే 2004లో సీన్ రివ‌ర్స్ అయింది. టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు ఏకం కావ‌డంతో ఒక్క‌సారిగా రాజ‌కీయం మారిపోయింది. జిల్లాలోని టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు అన్ని కూట‌మిల‌ను గెలుచుకుంటే టీడీపీకి ఒక్క‌టంటే ఒక్క‌ట సీటు ద‌క్క‌లేదు. 
 
అయినా కూడా డీలా ప‌డ‌ని టీడీపీ మ‌ళ్లీ 2009 ఎన్నికల్లో సుమారు తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను 5నిజ‌యోజ‌క‌వ‌ర్గాల్లో ప‌సుపు జెండా ఎగర‌వేసింది. అయితే ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కేవ‌లం ఎల్లారెడ్డిని స‌రిపెట్టుకుంటే నిజామాబాద్ అర్భ‌న్ లో బీజేసీ, బాల్ కొండ‌లో పీఆర్పీలు గెలిచాయి. ఇక బోధ‌న్ నియోజ‌క‌వ‌ర్గం మాత్రం కాంగ్రెస్ ఖాతాలో ప‌డింది. అయితే తెలంగాణ ఉద్య‌మం రాజ‌కీయాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. ఇక 2009 ఎన్నిక‌ల త‌ర్వాత ఈ జిల్లాలో ఉద్య‌మం ఉదృక్తమైంది. టీడీపీ నుంచి గెలిచిన బాన్స్ వాడా, కామా రెడ్డి ఎమ్మెల్యేలు ఆ త‌ర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అంతేకాదు ప‌ద‌వులను వ‌దుకుని మళ్లీ ఉప ఎన్నిక‌ల్లో గెలిచారు. అయితే 2004 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ ఎమ్మెల్యే హ‌నుమంత్ షిండే కూడా టీఆర్ఎస్ చేరిపోయారు.
 
ఇక తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత 2014లో నిజామాబాద్ రాజ‌కీయం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రం విడిపోయ‌న త‌ర్వాత తెలంగాణలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో నిజామాబాద్  జిల్లాలోని తొమ్మిదికి తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల‌ను టీఆర్ఎస్ క్లీన్ స్విప్ చేసింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ తో స‌హా ఇత‌ర రాజకీయాకులు కూడా క‌నుమ‌రుగైపోయారు.. నిజామాబాద్ ఎంపీగా టీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ కూతురు క‌విత గెలిచి పార్ల‌మెంట్ అడుగు పెట్టారు. 1999లో టీడీపీ గెలిచిన పార్ల‌మెంట్ స్థానంలో 2004,2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి మ‌ధు విజ‌యం సాధించారు. తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా ప్ర‌జా ప్ర‌తినిధుల రాజీనామాల‌తో సుమారు నాలుగు సార్లు ఉపఎన్నిక‌లు జ‌రిగాయి. 2008,2010,2011,2012 సంవ‌త్స‌రాల్లో టీఆర్ఎస్ కు మిశ్ర‌మ ఫ‌లితాలు వ‌చ్చాయి. 
 
2008లో డిచ్ ప‌ల్లి ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గాల‌కు జ‌రిగిన ఉపన్నిక‌ల్లో రెండుచోట్ల టీఆర్ఎస్ ఓట‌మి చెందింది. అలాగే 2010లో నిజామామాబాద్ అర్భ‌న్ నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి పోటీచేసి ల‌క్ష్మీనారాయ‌ణ సీనియ‌ర్ నేత డీఎస్ పై గెలిచారు. ఇక 2011లో బాన్స్ వాడ నుంచి శ్రీనివాస రెడ్డి 2012 భై ఎల‌క్ష‌న్స్ లో కామారెడ్డి నుంచి గోవ‌ర్థ‌న్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి మ‌ళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. 2014 ఎన్నిక‌ల్లో నిజామాబాద్ జిల్లా ఒక్కస్థానాన్ని కూడా ద‌క్కించుకోలేక పోయిన కాంగ్రెస్ వ‌చ్చేఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటాల‌ని ఉంది.
 
 ఇక ఇదే క్ర‌మంలో బీజేపీ కూడా నిజామాబాద్ పై దృష్టి సాధించింది. ఇక మ‌రోవైపు టీఆర్ఎస్ పోయిన ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఫ‌లితాల‌ను ద‌క్కించుకునేందుకు ప‌ట్టు వ‌ద‌ల‌కుంది. రైతుబందు లాంటి సంక్షేమ ప‌థ‌కాలు తిరుగులేని విజ‌యాన్ని అందిస్తాయ‌న్న న‌మ్మ‌కంతో ఉంది టీఆర్ఎస్ నిజామాద్ కామారెడ్డి జిల్లాలుగా విడిపోయిన ఉమ్మ‌డి జిల్లాల్లో గ్రూప్ గొడ‌వ‌లు, టికెట్ల పోటీ టీఆర్ఎస్ కు ప‌వాల్ గా మారేలా ఉన్నాయి. 
 
దీంతో డీఎస్ ఏపీసోడ్ లో కాక పుట్టించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పిడినప్ప‌టినుంచి నిజామాబాద్ జిల్లాలో అన్నిచోట్ల టీఆర్ఎస్ కు ప్రాథినిద్యం ఉన్నా పార్టీకి ఎక్కువ‌గా త‌ల‌నొప్పులు ఇక్క‌డినుంచే. చాలాకాలం నుంచి కొంద‌రి ఎమ్మెల్యేల‌పై విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. ఇక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో మ‌ఖ్య‌మంత్రి కేసీఆర్ తాజా స‌ర్వేలో ఈ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెగ్గ‌డం కష్టంగా ఉంద‌నే నివేదిక వ‌చ్చింద‌నే ప్ర‌చారం పార్టీనాయ‌కుల్లో క‌ల‌క‌లం రేపుతోంది. అటు కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలంగానే ఉన్నా నేత‌ల మ‌ధ్య వ‌ర్గ‌పోరు ఆపార్టీకి పెద్ద‌స‌మ‌స్య. ఇక ఇందూరులో కూడా ఒక‌టికి రెండు సిట్ల ప్ర‌భావం చూపుతోంద‌ని తెలుస్తోంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.