టీఆర్ ఎస్ నేతలు అందుకు దూరం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-07-13 18:43:30

టీఆర్ ఎస్ నేతలు అందుకు దూరం

ప్ర‌స్తుతం టీఆర్ ఎస్ నేత‌ల‌కు ఫోన్ ఫోబియా ప‌ట్టుకుందా అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అధికార టీఆర్ నేత‌ల‌ను ఏ సెంటెన్స్ లో చూసినా మూడు తిట్లు ఆరు బెదిరింపులుగా సాగుతున్నాయి. ఒక‌రు ఇద్ద‌రు కాదు ఇటీవ‌ల కాలంగా దాదాపు 25 మంది టీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌లు ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫోన్ లో అవ‌త‌లి వారిని బూతులు తిడుతూ బుక్క‌య్యారు. ఫోన్లో త‌మ‌పార్టీ ఎలాంటిదో చెప్పుకునేందుకు దిగుతూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. 
 
సోష‌ల్ మీడియాలో వేదిక‌గా టీఆర్ ఎస్ నేత‌ల వ్య‌వ‌హారం మూడు షేరింగ్స్ ఆరు అన్లైకులుగా ప‌ర‌వ‌ళ్లుతొక్కుతున్నాయి. అలా ఫోన్లో మాట్లాడుతూ వివాదంలో చిక్కుకున్న‌వారి సంఖ్య అధికార టీఆర్ ఎస్ లో భారీగానే ఉంది. ఎమ్మెల్యేలు వీరేషం, శంక‌ర్ నాయ‌క్ దూర్గం చెన్న‌య్య‌, గువ్వ‌ల బాల‌రాజు మొద‌లుకుని చాలా మంది లిస్ట్ లో ఉన్నారు. వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన పౌర‌స‌ర‌ఫ‌రా కార్పోరేష‌న్ పెద్ది సుద‌ర్శ‌న్ ఒక అధికారి విష‌యంలో ఫోన్ లో చేసిన‌ సంభాష‌ణ వైర‌ల్ గా మారింది.
 
ఫోన్ లో బూతు మాట‌లు సొంత పార్టీ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌టంలేదు. మున్సిపాలిటీలో అవివ్వాస తీర్మానం సంద‌ర్భంగా ఎమ్మెల్యే చెన్న‌య్య కౌన్సిల‌ర్ కూతురుతో బెదిరింపుల‌కు దిగ‌డం రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఫోన్ సంభాష‌ణ‌లో మ‌ధ్య మ‌ధ్య‌న ఓ కీల‌క మంత్రి పేరువాడుకోవ‌డంతో ఆయ‌న ఆగ్రహం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తోంది. 
 
అధికార ధ‌ర్ప‌మో లేక మ‌రొకటి కావ‌చ్చు ఫోన్లో నేత‌ల సంభాష‌ణ‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతుండ‌టంతో టీఆర్ ఎస్ నాయ‌కులు ఇప్పుడు జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలు ఫోన్లో మాట్లాడ‌టానికి చాలామంది వెన‌క‌డుగు వేస్తున్నార‌ట‌. అవ‌స‌ర‌మైతే నేరుగా మాట్లాడాల‌ని భావిస్తున్నారు త‌ప్ప ఫోన్లో మాత్రం స‌సేమిరా అంటున్నార‌ట‌.
 
ఇక మ‌రో వైపు ఫోన్ వివాదంలో చిక్కుకున్న నేత‌లను గులాబీబాస్ లు సేక‌రిస్తున్నార‌ట‌. వారి ఇమేజ్ తో పాటు పార్టీ ప్ర‌భుత్వ ఇమేజ్ దెబ్బ‌తినే ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని అనుమానిస్తూ టికెట్ కేటాయింపు స‌మ‌యంలో అధిష్టానం ఆచితూచి నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావిస్తోంద‌ట‌. గ‌తంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు ఫోన్ సంభాష‌ణ‌ల‌కు దూరంగా ఉండాల‌ని పార్టీ సూచించిన‌ప్ప‌టికి నేత‌ల తీరు మార‌డం లేద‌నే అభిప్రాయం అధిష్టానంలో ఉంద‌ట‌. దీంతో కొంద‌రిపై యాక్ష‌న్ తీసుకుంటే కొంత‌మంది ప‌రిస్థితి రిపిట్ కాద‌న్న ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.