మ‌క్త‌ల్ సీటుపై టీఆర్ఎస్ నేత‌లు కుమ్ములాట‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

trs
Updated:  2018-10-03 12:41:40

మ‌క్త‌ల్ సీటుపై టీఆర్ఎస్ నేత‌లు కుమ్ములాట‌

మ‌ఖ్తల్ సెగ్మంట్ లో చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి అధికార టీఆర్ఎస్ లో చేరిన‌ప్ప‌టినుంచి స్థానిక గులాభినేత‌లు గ్రూపులుగా చీలిపోతున్నారు. తాజాగా రామ్మోహ‌న్ రెడ్డి అభ్య‌ర్ధిత్వాన్ని ఖ‌రారు చేస్తూ టీఆర్ఎస్ అధినేత నిర్ణ‌యం తీసుకోవ‌డంతో అస‌మ్మ‌తినేత‌లు భ‌గ్గుమంటున్నారు. ఉద్య‌మ‌కాలం నాటి నుంచి ప‌ని చేసిన నేత‌ల‌కు, అలాగే ముందునుంచి కొన‌సాగుతున్న నాయ‌క‌త్వానికి  కార్య‌క‌ర్త‌ల‌కు రామ్మోహ‌న్ రెడ్డి ప్ర‌ధాన్య‌త ఇవ్వ‌కున్నార‌ని అసంమ్మ‌తి నేత‌లు గ‌తంలో చాలా సార్లు అధిష్టానానికి పిర్యాదు చేశారు. 
 
దీంతోపాటు మంత్రులు కూడా ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఆయ‌న వ్య‌వ‌హార శైలి మార‌కుంద‌ని పార్టీకి చెందిన నాయ‌కులు మండిప‌డుతున్నారు, ఇక 2014 ఎన్నిక‌లో మ‌ఖ్త‌ల్ నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్ధిగా దివంగ‌త ఎల్లారెడ్డి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రామ్మోహ‌న్ రెడ్డి గెలుపొందారు. ఆ త‌ర్వాత మారిన రాజ‌కీయ ప‌రినామాల‌తో రామ్మోహ‌న్ రెడ్డి గులాభి కండువా క‌ప్పుకున్నారు.  నాటినుంచి నియోజ‌క‌వ‌ర్గ పార్టీ ఇంచార్జ్ గా ప‌ని చేసిన దేవ‌ర మ‌ల్ల‌ప్ప‌కు రామ్మోహ‌న్ రెడ్డికి ముందునుంచి విభేదాలు ఉన్నాయి.
 
ఇక అది గ‌మ‌నించి కేసీఆర్ అసెంబ్లీ ర‌ద్దు చేయ‌క‌ముందే  దేవ‌ర మ‌ల్ల‌ప్ప‌కు కార్పోరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. దీంతో విభేదాలు పెద్ద‌గా ఉండ‌వ‌ని భావించారు. అయితే మిగిలిన అసంమ్మ‌తినేత‌లు మాత్రం రామ్మోహ‌న్ రెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తుండ‌టంతో టీఆర్ఎస్ కు త‌ల‌నొప్పులు త‌గ్గ‌డంలేదు. ఉద్య‌మ స‌మ‌యంలో ఆటుపోట్ల‌ను ఎదుర్కుని గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొని ప‌నిచేసిన త‌మ‌ను రామ్మోహ‌న్ రెడ్డి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డుతున్నారు.
 
త‌మ అనుచ‌రుల‌కే ప్ర‌ధాన్య‌త ఇస్తూ మండ‌ల స్థాయి ప‌ద‌వుల‌ను, నామినేటెడ్ ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టార‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ప్ర‌క‌ట‌న‌ల కంటే ముందు మ‌ఖ్త‌ల్ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మార్పు ఉంటుంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. దీంతో చాలామంది ఆశావాహులు టికెట్ కోసం ఆశ‌ప‌డ్డారు. అయితే టీఆర్ఎస్ అధినేత ఈ ప్ర‌చారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా మ‌ఖ్త‌ల్ సిట్టంగ్ ఎమ్మెల్యే అయిన రామ్మోహ‌న్ రెడ్డికే ఖ‌రారు చేయ‌డంతో అస‌మ్మ‌తినేత‌లంత ఒక్క‌టై తిరుగుబాటు జెండా ఎగ‌ర వేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.