కేసీఆర్ ను బ‌జారుకీడ్చ‌డంలో వీళ్లే నెంబ‌ర్ వ‌న్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr
Updated:  2018-08-30 03:40:26

కేసీఆర్ ను బ‌జారుకీడ్చ‌డంలో వీళ్లే నెంబ‌ర్ వ‌న్

టీఆర్ఎస్ లో గ్రూపు రాజ‌కీయాలు పార్టీ అధిష్టానానికి నిద్ర‌ప‌ట్ట‌నివ్వ‌డం లేదు. ఓవైపు ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తినివేద‌న స‌భ‌కు ఏర్పాట్లు ముమ్మ‌రం చేస్తుంటే ఎంపీ - ఎమ్మెల్యే - డిప్యూటీ సీఎం - ఎస్సీ ఎస్టీ ఛైర్మ‌న్ లు ఒక‌రిపై ఒక‌రు కీచులాడుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కార్య‌క‌ర్త‌ల‌కు విసుగుతెప్పిస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో త‌మ ఉనికిని కాపాడుకునేందుకు స‌ద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు తాడోపేడో తేల్చుకునేందుకు క‌త్తులు దూస్తున్నారు. 
 
ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే ఏ పార్టీకైనా బ‌ల‌మైన నాయ‌కుడు కావాలి. మ‌రి ఆ నాయ‌కుడే స‌హ‌చ‌రుల‌పై దాడి చేస్తుంటే ప్ర‌జ‌లు ఎవ‌రికి ఓటేయ్యాలి. ఎవ‌ర్ని గెలిపించాలి. ప్ర‌స్తుతం ఇలాంటి ప‌రిస్థితులే జ‌న‌గామ జిల్లా టీఆర్ఎస్ కేడ‌ర్ మ‌ధ్య న‌డుస్తున్న చ‌ర్చ.ఎన్నిక‌ల్లో ఐక్య‌మ‌త్యంగా ఉండాల్సిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్,స్టేష‌న్ ఘ‌న్ పూర్ మాజీ ఎస్సీ - ఎస్టీ ఛైర్మ‌న్ రాజార‌పు ప్ర‌తాప్,మాజీ డిప్యూటీ సీఎం డాక్ట‌ర్ రాజ‌య్య ల మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
 
ప్ర‌జ‌ల్లో త‌మ స‌త్తా నిరూపించుకునేందుకు పోటీపోటీగా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. పొర‌పాటున ఒక‌రి కార్య‌క్ర‌మానికి ఒక‌రు వ‌చ్చిన..ఆ స‌మ‌యాల్లో ఎడ‌మొహం పెడ‌మొహంగా ఉంటున్నారు. మీడియా స‌మావేశాల్లో, బ‌హిరంగ స‌మావేశాల్లో నువ్వుంత నీ బ‌తుకెంత అంటూ ఒక‌రిపై దుమ్మెత్తిపోసుకుంటున్నారు.  
 
ప్ర‌త్యేక జిల్లా జ‌న‌గామ ఏర్పాటుకు తాను కృషి చేశాన‌ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చెబుతుంటే, కాదు నేనే చేశాన‌ని ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్ చెప్పుకుంటున్నారు. దీంతో వారిద్ద‌ర మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీనికి తోడు జిల్లాలో ఎలాంటి కార్య‌క్ర‌మాలు జ‌రిగినా ప్రొటోకాల్ ప్ర‌కారం ఎంపీకి స‌మాచారం ఇవ్వక పోవ‌డంతో నేత‌ల మ‌ధ్య దూరం మ‌రింత పెరిగింది. 
 
స్టేష‌న్ ఘ‌న్ పూర్ లో మాజీ డిప్యూటీ సీఎం రాజ‌య్య‌, ప్ర‌స్తుత డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రిల మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంది. త‌న నోటి దురుసువ‌ల్ల ప‌ద‌విని పోగొట్టుకున్న రాజయ్య మాత్రం..క‌డియం శ్రీహ‌రి వ‌ల్లే తాను ప‌ద‌విని కోల్పోయాన‌ని మ‌ధ‌న‌ప‌డుతున్నారు. అందుకే  ప‌లుమార్లు కడియం శ్రీహరిపై నోరుపారేసుకున్నారు. క‌డియం స్థానికుడే కాద‌ని ప్ర‌చారం చేశారు. 
 
దీనికి తోడు మాజీ ఎస్సీ-ఎస్టీ ఛైర్మ‌న్ గా వ్య‌వ‌హ‌రించిన రాజార‌పు ప్ర‌తాప్ కు - రాజ‌య్య వ‌ర్గానికి మ‌ధ్య చిన్న‌సైజ్ యుద్ధాన్ని త‌లపించేలా వార్ న‌డుస్తోంది. మాజీ అయిన రాజార‌పు ప్ర‌జ‌ల బాగోగులు తెలుసుకుంటూ , వారి అవ‌స‌రాల్ని ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించ‌డంతో ఎక్క‌డ త‌మ‌కు ఎస‌రు పెడ‌తారేమోన‌ని రాజయ్య వ‌ర్గం రాజార‌పు ప్ర‌తాప్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. దీంతో పార్టీ ప‌రువును ఇరువురు బ‌జారుకీడ్చుతున్నారంటూ ప్ర‌జ‌లు గుస‌గుస‌లాడుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.