టికెట్ ఇవ్వ‌క‌పోతే రెబ‌ల్ గా పోటీ చేస్తాం కేసీఆర్ కు హెచ్చ‌రిక‌లు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana cm kcr
Updated:  2018-09-21 01:53:41

టికెట్ ఇవ్వ‌క‌పోతే రెబ‌ల్ గా పోటీ చేస్తాం కేసీఆర్ కు హెచ్చ‌రిక‌లు

తెలంగాణ లో ముంద‌స్తు ఎన్నిక‌ల జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ముందుగానే అభ్య‌ర్ధుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించ‌డంతో ఆ పార్టీలో అస‌మ్మ‌తి సెగ బాగానే ఉంది. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇద్ద‌రిద్ద‌రు అభ్య‌ర్థులు సీటు కోసం హ‌డావిడి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో 15 స్థానాల్లో పార్టీ నాయ‌కులు భేటీలు ర్యాలీలు ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్నారు.
 
ఒక వైపు టికెట్ కోసం ప్ర‌య‌త్నిస్తూనే మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతున్నారు. ఈ క్ర‌మంలో ఖైర‌తాబాద్ లో న‌లుగురు టీఆర్ఎస్ నాయ‌కులు పోటీ పడుతున్నారు. దానం నాగేంద‌ర్ తోపాటు  పార్టీ ఇంచార్జ్ మ‌న్నే గోవ‌ర్థ‌న్ రెడ్డి, పీజేఆర్ కుమార్తె విజ‌యా రెడ్డి, కే,కే, కూతురు విజ‌య‌ల‌క్ష్మీ పోటాపోటీగా ప్ర‌చారం చేస్తున్నారు. గోషామ‌హ‌ల్ లో నంది కిషోర్  బిలాల్ కు పోటీగా ప్రేమ్ సింగ్ రాథోడ్ ఉన్నారు.ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మార్వాడీలు గుజ‌రాతీలు పెద్ద‌సంఖ్య‌లో ఉన్నారు. 
 
ఇక ముషిరాబాద్ లో ముఠా గోపాల్ కు పోటీగా నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ప్ర‌చారం చేస్తున్నారు. ఇక అంబ‌ర్ పేట‌లో సుధాక‌ర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కృష్ణ యాద‌వ్ ప్రచారం చేస్తున్నారు. అలాగే సుదీర్ రెడ్డికి ఎంపీ మ‌ల్లారెడ్డికి పోటీ కొన‌సాగుతుంది. అలాగే మ‌ల‌ఖ్ పేట‌లో ఉప‌ముఖ్య‌మంత్రికి మ‌హ‌ముద్ అలీ కుమారుడు ఆజం అలీకి చెవ్వ స‌తీష్ కుమార్ కు మ‌ధ్య పోటీ కొన‌సాగుతుంది. 
 
ఇక మ‌ల్కాజ్ గిరిలో క‌న‌కారెడ్డి త‌న కొడుకుల‌కు ప్ర‌చారం వ‌స్తుంద‌నే ప్ర‌చారం చేస్తున్నారు. ఇక వికారాబాద్ టికెట్ కోసం మెతుకు ఆనంద్ ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీరంద‌రికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించ‌క‌పోతే రెబ‌ల్ గా అయినా పోటీ చేస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.