టీడీపీ అవిశ్వాసానికి ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వాలి

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-03-21 18:39:12

టీడీపీ అవిశ్వాసానికి ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వాలి

రాష్ట్రానికి ప్ర‌త్యేక‌హోదా కోరుతూ కేంద్రం పై అవిశ్వాస తీర్మానానికి సిద్దం అయినా టీడీపీకి ఎందుకు మ‌ద్ద‌తివ్వాల‌ని టీఆర‌య‌స్ పార్టీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ప్ర‌శ్నించారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అవిశ్వాసం ప్ర‌వేశ పెట్ట‌డానికి ముందు కేసీఆర్‌తో టీడీపీ ఏమైనా సంప్రదింపులు జరిపిందా అని ఆయన ప్రశ్నించారు. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీతో పొత్తు పెట్ట‌కున్న‌ప్పుడు టీఆర్‌ఎస్‌ను సంప్రదించారా అని జీవన్‌ రెడ్డి ప్ర‌శ్నించారు.
 
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో రాజ‌కీయ ల‌బ్దికోసం టీడీపీ చేస్తున్న పోరాటానికి టీఆర్‌య‌స్ ఎందుకు అండ‌గా నిల‌బ‌డాల‌ని అడిగారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినపుడు క‌నీసం ఒక్క‌సారైనా టీడీపీ తమ పక్షాన మాట్లాడిందా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం నియంత‌గా ప్ర‌వ‌ర్తించి రాష్ట్రాల‌కు అన్యాయం చేస్తే వ్య‌తిరేకంగా పోరాటం చేసింది మొద‌ట కేసీఆర్‌ని ఆయ‌న‌ తెలిపారు.
 
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా త‌మ నాయ‌కుడు కేసీఆర్ తిరుగుబాటు చేస్తుంటే టీడీపీ ఎందుకు తమతో క‌లిసి రాలేద‌ని అన్నారు. టీడీపీ త‌మ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోయిన‌ప్ప‌టికి  విభజన చట్టంలో ఉన్న అంశాల‌ను అమ‌లు చేయాల‌ని పార్ల‌మెంట్ వేదిక‌గా  టీఆర్‌ఎస్‌ ఎంపీలు పోరాటం చేశార‌ని ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు.అవిశ్వాస తీర్మానానికి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీల‌ను ఏకం చేస్తాన‌ని  చెబుతున్న చంద్ర‌బాబు తెలుగు రాష్ఠ్రం అయిన తెలంగాణలో టీఆర్‌య‌స్ మ‌ద్ద‌తును క‌లుపుకోని తెలుగుదేశం పార్టీ కేంద్రం పై విజ‌యం సాధిస్తుందా అని  రాష్ట్ర ప్ర‌జ‌లు  చ‌ర్చించుకుంటున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.