సంచ‌ల‌నం నేను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

trs mp kavitha
Updated:  2018-08-30 05:39:08

సంచ‌ల‌నం నేను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో అటు ఏపీ రాజ‌కీయాల‌తో పాటు తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు కూడా హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార నాయ‌కులు ప్ర‌తిప‌క్ష‌నాయ‌కుల‌పై, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు అధికార నాయ‌కుల‌పై స్థాయికి మించిన రీతిలో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. అయితే ఇదే క్ర‌మంలో టీ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు మీడియాను వేదిక‌గా చేసుకుని టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్నా ఇంత‌వ‌ర‌కు ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికి కూడా స‌క్ర‌మంగా నిధుల‌ను కేటాయించ‌లేద‌ని మండిప‌డ్డారు. 
 
ఇక తాజాగా వారు చేసిన వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ ఎంపీ క‌విత స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయ‌కులు ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే స‌హించ‌బోమ‌ని ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం ఇచ్చిన‌ట్లు మాట్లాడితే చ‌ట్ట‌ప‌రంగా వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని క‌విత హెచ్చ‌రించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గానికి 2 వేల కోట్ల‌కంటే త‌క్కువ నిధుల‌ను కేటాయించామ‌ని నిరూపిస్తే తాను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 
 
అయితే నిరుపించ‌లేని ప‌క్షంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటారా అని స‌వాల్ విసిరారు క‌విత‌. ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి త‌న‌కు తెలియ‌ద‌ని కానీ ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా  టీఆర్ఎస్ దే విజ‌యం అని ఆమె స్ప‌ష్టం చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసి అభివృద్ది కార్య‌క్రాలు చూసి కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు త‌ట్టుకోలేక‌పోతున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. కాంగ్రెస్ నాయకుల‌కు ప్ర‌జ‌ల బాగోగులు తెలియ‌వ‌ని వారి గోల్ అధికారం మాత్ర‌మే అని క‌విత ఎద్దేవా చేశారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.