ఆస‌క్తిక‌రంగా టీఆర్‌ఎస్‌ ఎంపీల ప్రమాణస్వీకారం

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-04-04 17:49:59

ఆస‌క్తిక‌రంగా టీఆర్‌ఎస్‌ ఎంపీల ప్రమాణస్వీకారం

ఇటీవల తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విష‌యం అంద‌రికి తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో సామాజిక వ‌ర్గాల‌ను దృష్టిలో ఉంచుకుని  అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు సీఎం కేసీఆర్....రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగిన మూడు స్థానాల్లోను టీఆర్‌య‌స్ అభ్య‌ర్థులే విజ‌యం సాధించారు. విజ‌యం సాధించిన జోగినపల్లి సంతోష్‌, బడుగుల లింగయ్య, బండా ప్రకాశ్ రాజ్య‌స‌భలో నేడు ప్ర‌మాణ స్వీకారం చేశారు. 
 
రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన జోగినపల్లి సంతోష్‌, బడుగుల లింగయ్య, బండా ప్రకాశ్  రాజ్యసభలో  తెలుగులో ప్రమాణం చేశారు.  వీరితో పాటు ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎస్పీ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన జయా బచ్చన్‌ హిందీలో ప్రమాణం చేశారు..... వీరు స‌భ‌లో  సభాపతిగా వెంకయ్యనాయుడు ఉండ‌గా ప్ర‌మాణం చేశారు . ఇక ప్రమాణం స్వీకరించిన కొత్త సభ్యులకు చప్పట్లతో తోటి సభ్యులు పెద్దల సభలోకి ఆహ్వానం పలికారు.
 
కేసీఆర్‌ మేనల్లుడు, ఆయన సన్నిహితుడిగా ఇన్నాళ్లు తెరవెనక ఉండి.. రాజకీయ వ్యూహ, ప్రతివ్యూహాలు రచించిన సంతోష్‌కుమార్‌ ఈసారి రాజ్యసభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయంగా వెలుగులోకి వచ్చారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.