ఉత్త‌మ్ కేటీఆర్ ల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

ktr and uthham kumar reddy
Updated:  2018-10-25 12:04:19

ఉత్త‌మ్ కేటీఆర్ ల మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్

ముంద‌స్తు ఎన్నిక‌ల త‌రుణంలో తెలంగాణ పోలీసుల వ్య‌వ‌హార శైలిపై కాంగ్రెస్ పార్టీ అధికార టీఆర్ఎస్ నాయ‌కులు మ‌ధ్య సోషల్ మీడియా, ట్విట్ట‌ర్ లో వార్ జ‌రుగుతుంది. ఈ క్ర‌మంలో తెలంగాణ పోలీసుల‌పై కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కొద్దికాలంగా పోలీస్ అధికారులు ఉద్దేశ పుర్వ‌కంగానే సోదాలు చేస్తున్నార‌ని ఉత్త‌మ్ ఆరోపించారు. అంతేకాదు ఓ డీఐజీ అధికారితో పాటు టాస్క్ ఫోర్స్  పోలీసుల‌పై విమ‌ర్శ‌లు చేశారు ఆయ‌న‌. 
 
ఇక పోలీసుల‌పై ఉత్త‌మ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ తీవ్రంగా తిప్పి కొట్టారు. పోలీసుల‌కు కులం అంట‌గ‌డుతున్నారని అయితే ఇది మంచిప‌ద్ద‌తి కాద‌ని కేటీఆర్ హెచ్చ‌రించారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ వ్య‌వ‌స్థ‌కు మంచిపేరుంద‌ని అన్నారు. ఉత్తమ్ ఇలా ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే పోలీసులు స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న వారి మ‌నోభావాలు దెబ్బ‌తింటాయ‌ని కేటీఆర్ తెలిపారు. 

షేర్ :