కాంగ్రెస్ కు బిగ్ షాక్ సాయంత్రంలోగా ప్ర‌జాకూట‌మి నుంచి రెండు పార్టీలు ఔట్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

telangana parties
Updated:  2018-11-05 11:02:52

కాంగ్రెస్ కు బిగ్ షాక్ సాయంత్రంలోగా ప్ర‌జాకూట‌మి నుంచి రెండు పార్టీలు ఔట్

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఏర్పాటు చేసిన ప్ర‌జా కూట‌మిలో సీట్ల ప్ర‌తీస్తంబ‌న కొన‌సాగుతూనే ఉంది. సీట్ల‌పై నేత‌లు సిగ‌పాట్లు ప‌డుతున్నా స‌ర్దుబాట్లు మాత్రం ఒక కొలిక్కి రావ‌డంలేదు. దీంతో మిత్ర‌ప‌క్షాలు కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్నాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ తీరుతో టీజేఎస్, సీపీఐ విసిగిపోయి వేసారిపోతున్నాయి. 
 
ఇక చేసేది ఏమిలేక త‌మ‌దారి తాము చూసుకోవాల్సి వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే అల్టిమెంట్ స‌మాచారాన్ని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అందించారు. దీంతో ఉత్త‌మ్ అల‌ర్ట్ అయి ఇప్ప‌టికే వారిని బుజ్జ‌గించే కార్య‌క్ర‌మం కూడా చేస్తున్నారు. మిత్ర ప‌క్షాల‌న్ని ఈ రోజు సాయ‌త్రం వ‌ర‌కు ఓపిక ప‌ట్టాల‌ని సీపీఐ నేత వెంక‌ట రెడ్డికి ఫోన్ చేసి చెప్పారు. 
 
అన్ని పార్టీలు సాయంత్రం వ‌ర‌కు ఓపిక‌ప‌డితే స‌ర్థుబాట్లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేయ‌డంతో సీపీఐ నేత‌లు కాస్త చ‌ల్ల‌బ‌డినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు కూట‌మిలో సీట్ల సర్దుబాటు ప్ర‌క్రియ చ‌ర్చ ద‌గ్గేరే ఉండ‌టంపై టీజేఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రాం తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని క‌లిసినా కాంగ్రెస్ తీరులో మార్పు రాక‌పోవ‌డంపై ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌త‌రుణంలో కాంగ్రెస్ నాయ‌కులు సీట్ల‌పై క్లారిటీ ఇవ్వ‌క‌పోతే త‌మ‌దారి తాము చూసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. త‌మ‌కు ఖ‌చ్చితంగా 10 సీట్లు ఇవ్వాల్సిందే అని కోదండ‌రాం డిమాండ్ చేశారు. 

షేర్ :

Comments

0 Comment