కేసీఆర్ కు ఉత్త‌మ్ సంచ‌ల‌న స‌వాల్

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

uttam kumar image
Updated:  2018-03-01 04:07:13

కేసీఆర్ కు ఉత్త‌మ్ సంచ‌ల‌న స‌వాల్

ఎన్నిక‌ల సంద‌ర్బంగా కొంద‌రు నాయ‌కులు త‌మ పార్టీకాని , వారు కాని  గెల‌వ‌క పోతే రాజ‌కీయాలు నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకుంటామ‌ని స‌వాల్ చేస్తుంటారు. అయితే వీటిని ఎన్నిక‌ల త‌ర్వాత ఎవ‌రూ పాటించ‌రు. అయితే స‌మైఖ్యాంధ్రా ఉధ్య‌మ‌ స‌మ‌యంలో, రాష్ట్రాన్ని విభ‌జిస్తే రాజ‌కీయాలు నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ చేశారు ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్‌. త‌ర్వాత‌ రాష్ట్ర విభ‌జ‌న జ‌ర‌గ‌డంతో, ల‌గ‌డ‌పాటి రాజ‌కీయాలు నుంచి త‌ప్పుకుని మాట నిలుపుకున్నారు.. అలా  ఎకైక నాయ‌కుడు ఎవ‌రైనా ఉన్నారు అంటే ల‌గ‌డ‌పాటి రాజ్‌గోపాల్ అనే చెప్పాలి.
 
ప్ర‌స్తుతం సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో రాజ‌కీయ నాయ‌కులు స‌వాళ్ల‌కు సిద్దం అవుతున్నారు.... తాజాగా  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ  అధ్య‌క్షుడు ఉత్తమ్  కుమార్ రెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఒక సవాల్ విసిరారు. రాబోయే ఎన్నిక‌ల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద‌ని అన్నారు. అలా జ‌ర‌గ‌క‌పోతే తాను రాజ‌కీయాలు నుంచి పూర్తి స్థాయిలో వైదొలుగుతాన‌ని తెలిపారు.
 
అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ 106 సీట్లును సాధించుకోక‌పోతే కేసీఆర్‌ రాజకీయాల నుంచి తప్పుకొంటారా అని ఉత్తమ్‌ సవాల్‌ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2019–20లో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌ రూ.1.90 లక్షల కోట్ల మేర ఉంటుందన్నారు. సాగు, తాగునీటి ప్రాజెక్టుల్లో సీఎం ఆరు శాతం కమీషన్‌ తీసుకుంటున్నారని.. తాము అధికారంలోకి రాగానే కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులపై పునః సమీక్ష జరుపుతామని తెలియ‌చేశారు. ఇక ఉత్త‌మ్ వ్యాఖ్య‌ల‌తో ఇవి ఉత్తిత్తి వ్యాఖ్య‌లా నిజ‌మైన వ్యాఖ్య‌లా అంటూ టీఆర్ ఎస్ నాయ‌కులు స‌టైర్లు వేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.