ఉత్త‌మ్ కుమార్ క్లారిటీ

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-04-12 16:38:53

ఉత్త‌మ్ కుమార్ క్లారిటీ

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత‌లు స‌ర్వం సిద్దం చేసుకుంటున్నారు...  అధికార‌మే ల‌క్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు... టీఆర్ ఎస్ ను ఓడించే దిశ‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంద‌రు  కీల‌క నాయ‌కులు ప‌లు పార్టీల‌ నేత‌ల‌తో ర‌హ‌స్య మంత‌నాలు జ‌రుపుతున్నారని తెలుస్తోంది...
 
ఈ మంత‌నాలు జ‌రిపిన తర్వాత వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవ‌డ‌మా..? లేక వారితో పొత్తు పెట్టుకుని సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం జ‌రుగుతుందని తెలుస్తోంది... అయితే తాజాగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు చూస్తుంటే వచ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ కాంగ్రెస్  టీడీపీ తో పొత్తు పెట్టుకునే ప‌రిస్థితి క‌నిపిస్తోంది..
 
ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ భ‌వ‌న్ లో ఆయ‌న మాట్లాడుతూ తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందని తెలిపారు.. అయితే టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అని మీడియా  ప్రశ్నించగా ఆ పార్టీకి కొన్ని చోట్ల ఓటు బ్యాంకు ఉందని అయినా ఫలానా పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని ఉందా? అలా పెట్టుకుంటే నేరం అవుతుందా? అని వ్యాఖ్యానించారాయ‌న‌.
 
తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నాపెట్టుకోక‌పోయినా కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజ‌యం సాధిస్తుంద‌ని ఉత్త‌మ్ త‌న ధీమాను వ్య‌క్తం చేశారు.. అయితే ఇప్ప‌టికే త‌మ పార్టీ నేత‌లు పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేస్తున్నార‌ని, ఉత్తర తెలంగాణలోనూ మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పారు.అక్కడ బస్సుయాత్రకు వస్తున్న బ్రహ్మాండమైన స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు...
 
అలాగే త‌మ పార్టీ నేత‌ల మ‌ధ్య ఎన్నోవిభేదాలు ఉన్నా కానీ పార్టీ ఆఫీస్ లోకి చేరుకోగానే అవ‌న్ని మ‌రిచిపోతామని స్ప‌ష్టం చేశారు... తామంద‌రం వ‌చ్చే ఎన్నిక‌ల‌కోసం క‌లిసి క‌ట్టుగా ప‌నిచేసి టీఆర్ ఎస్ ను ఓడించే దిశ‌గా ప్ర‌యాణిస్తున్నామని ఉత్త‌మ్ స్ప‌ష్టం చేశారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.