ప‌వన్ కు వీహెచ్ సూటి ప్ర‌శ్న‌లు ?

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-01-25 12:35:57

ప‌వన్ కు వీహెచ్ సూటి ప్ర‌శ్న‌లు ?

ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టా అని స‌ర్కారును ప్రశ్నించ‌కుండా, ప్ర‌సంశించే వ్య‌క్తి దేశంలో ఏకైన నాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్  అని, తెలంగాణ‌లోని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. అవినీతి అక్ర‌మాలపై త‌న పోరాటం జ‌రుగుతుంది అని జ‌న‌సేనాని ప్ర‌క‌ట‌న చేశారు..
 
  
ప‌వ‌న్ యాత్ర‌పై కాంగ్రెస్  సీనియ‌ర్ నాయ‌కుడు.. వి. హ‌న్మంత‌రావు మాట్లాడారు.. అస‌లు ప‌వ‌న్ ఎవ‌రిని ప్ర‌శ్నిస్తున్నాడ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు..ప్రాణహిత ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి సీఎం కేసీఆర్‌ రూ.38 వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని  ఆయ‌న ఆరోపించారు.. కేవ‌లం తెలంగాణ‌లో కేసీఆర్ కోస‌మే ప‌వ‌న్ యాత్ర చేస్తున్నార‌ని ఇటు కేసీఆర్ రాసిచ్చిన స్పీచ్ ప‌వ‌న్ చ‌దువుతున్నార‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు.. ఇటు కేసీఆర్ కు భ‌జ‌న చేసే కార్య‌క్ర‌మానికి ఫుల్ స్టాప్ పెట్టాల‌ని వీహెచ్ ప‌వ‌న్ కు హిత‌వు ప‌లికారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.