కాంగ్రెస్ లో కేసీఆర్ కో-వ‌ర్టులు వీహెచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

kcr and vh hanumantha rao and congress
Updated:  2018-09-20 02:29:15

కాంగ్రెస్ లో కేసీఆర్ కో-వ‌ర్టులు వీహెచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముస‌లం పుట్టింది. తాజాగా ఏర్పాటు చేసిన క‌మిటీ ఏర్పాటులో ప‌లువురు నేత‌లు త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ లోను ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోవ‌ర్టులు ఉన్నారంటూ వీహెచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ప‌ద‌విని ఇస్తే కేసీఆర్ ను ఓడిస్తాన‌ని అత‌ని కోవ‌ర్టులు భ‌య‌ప‌డ్డార‌ని అందుకే త‌న‌కు ప‌ద‌వి రాకుండా చేశార‌ని వీహెచ్ ఆరోపించారు. 
 
ఇక మ‌రోవైపు హైద‌రాబాద్ లోని గాంధీ భ‌వ‌న్ కు  చేరుకున్న గులాం న‌బీ ఆజాద్ ను కాంగ్రెస్ ఆశావాహులు చుట్టు ముట్టారు. అయితే ముందు అంద‌రు పార్టీ కోసం పని చెయ్యాల‌ని ఎవ‌రికి టికెట్లు కేటాయించాల‌నే విష‌యంలో అధిష్టానం చూసుకుంటుందని ఆజాద్ వాళ్ల‌ను శాంతింప‌జేసే ప్ర‌య‌త్నం చేశారు. 
 
ఇంత‌కు ముందులా టికెట్లు ఇవ్వ‌డం కుద‌ర‌దంటూ పార్టీ శ్రేణుల‌కు స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేత‌లు గాంధీ భ‌వ‌న్ చుట్టూ తిర‌గ‌డం మాని నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కోసం ప‌ని చెయ్యాల‌ని అన్నారు. సీనియ‌ర్లు అయిఉండి పార్టీకోసం పని చేసేవారికి త‌ప్ప‌కుండా టికెట్లు ఇస్తుంద‌ని ఇందులో కంగారు ప‌డాల్సిన అవ‌సరం లేద‌ని ఆజాద్ సూచించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.