తెలంగాణ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఆయ‌నే

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

bjp
Updated:  2018-10-02 12:10:25

తెలంగాణ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఆయ‌నే

తెలంగాణ గ‌ట్టు మీద ఎన్నిక‌ల కేంద్రంగా రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. అయితే ఇదే క్ర‌మంలో రాష్ట్రంలో ప‌ట్టు పెంచుకునేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ జ‌న చైత‌న్య యాత్ర నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన పోటీ టీఆర్ఎస్- కాంగ్రెస్ మ‌ధ్య‌నే కాదు ఈ సారి ముక్కోన‌పు పోరు త‌ప్ప‌ద‌ని క‌మ‌ల‌నాధులు చెబుతున్నారు. త‌క్కువ స‌మ‌యంలో ఆ స్థాయిలో బ‌లం పెంచుకోవాల‌న్నా, పార్టీ మీద ప్ర‌జ‌ల్లో పాజిటీవ్ వేవ్ క్రియేట్ చెయ్యాల‌న్నా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించాల‌ని పార్టీ ఆలోచ‌న చేస్తోంద‌ట‌. 
 
ఆప‌రేష‌న్ 2019 అంటున్న బీజేపీ...తెలంగాణ సీఎం అభ్య‌ర్థిగా మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావును ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. విద్యాసాగ‌ర్ రావు తెలంగాణ బీజేపీలో సీనియ‌ర్ నేత‌, అలాగే పార్టీలో జాతీయ స్థాయి సంబంధాలు ఉన్ననేత‌. గతంలో విద్యాసాగ‌ర్ రావు కేంద్ర‌మంత్రిగా పని చేశారు. అలాగే మెట్ ప‌ల్లినుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఇప్పుడు మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా ఉన్నారు. 
 
 తెలంగాణ‌లో హోరా హోరీగా సాగే ఎన్నిక‌ల్లో విద్యాసాగ‌ర్ ను రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చి ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించి ఎన్నిక‌ల భ‌రిలోకి దిగాల‌ని ఖాశాయం నాయ‌కులు భావిస్తున్నార‌ట‌. పార్టీ చ‌రీష్మ‌గ‌ల నేత‌కోసం ఆలోచ‌న‌చేస్తున్న  అదిష్టానం విద్యాసాగ‌ర్  మీద ఫోక‌స్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. చాలాకాలంగా హైద‌రాబాద్ కే ప‌రిమ‌తం అవుతున్న పార్టీని ఇత‌ర జిల్లాల‌కు వేగంగా పార్టీని విస్త‌రింప‌చేయ్యాలంటే బ‌ల‌మైన నేత అవ‌స‌రం అని అయితే ఇది విద్యాసాగ‌ర్ రావు అని పార్టీలో చ‌ర్చ సాగుతోంద‌ట‌. 
 
ఉత్త‌ర తెలంగాణ జిల్లాల‌కు చెందిన‌ నేత‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టిస్తే మిగిలిన అన్ని జిల్లాల మీద దీని ప్ర‌భావం ఉంటుంద‌ని బీజేపీ నాయ‌కులు భావిస్తున్నార‌ట‌. ఇక ఈ ప్ర‌తిపాద‌న‌పై కూడా విద్యాస‌గ‌ర్ రావు పాజిటివ్ గా స్పందించార‌ట‌. వాస్త‌వానికి ఆయ‌న మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అయిన త‌ర్వాత విద్యాసాగ‌ర్ చ‌రిష్మా పెరిగింది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.