అల‌క‌పాన్పుపై రాముల‌మ్మ‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

vijaya shanthi
Updated:  2018-09-12 04:37:28

అల‌క‌పాన్పుపై రాముల‌మ్మ‌

ఇన్నాళ్లు ఎక్కడ ఉందో తెలియదు. ఏం చేస్తుందో సమాచారం లేదు. హఠాత్తుగా తిరిగి రాజకీయాల్లోకి వచ్చింది రాములమ్మ. అదేనండి. మన విజయశాంతి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటోంది. సొంత పార్టీ పెట్టి నడపటం చేతగాక చిరంజీవిలా జెండా పీకేసింది. టీఆర్ఎస్ లో విలీనం చేసింది. మెదక్ లో ఎంపీగా గెలిచింది. ఆ తర్వాత ఓడింది. ఓటమి బాధతో చైన్నైకు చెక్కేసింది. తెలంగాణ గురించి పట్టించుకోవడమే మానేసింది. కేసీఆర్ తో పొసగక పోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఆమె తిరిగి క్రియాశీలకం అయ్యే ఆలోచన చేసింది.
 
గ‌తంలో  తెలంగాణ‌లో ప‌ర్య‌ట‌న చేసిన జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై సెటైర్లే వేసింది. పవన్‌‌కల్యాణ్‌‌ను టూరిస్ట్ అన్న కేసీఆర్.. తెలంగాణలో యాత్ర కోసం ఏ వీసా ఇచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించింది. తెలంగాణ ఉద్య‌మ‌నేత కోదండరాంతో పాటు, ఇతర నేతలకు కూడా పవన్‌ మాదిరిగా వీసాలిస్తే కనీసం వారికి తెలంగాణలో ఉన్నామన్న భావన కలుగుతుందని జోక్ చేశారు. పవన్‌కల్యాణ్ లాంటి టూరిస్ట్‌ నేతకు ఇచ్చిన స్వేచ్ఛ ఉద్యమ నేతలకు ఇవ్వలేదని వాపోయారు విజయశాంతి.
 
ముంద‌స్తు ఎన్నిక‌ల త‌రుణంలో రాములమ్మ ఎక్క‌డా..? రాహుల్ గాంధీ హైద‌ర‌బాద్ వ‌చ్చినా ఎందుకు క‌నిపించ‌లేదు   చివ‌రికి అసెంబ్లీ ర‌ద్దైన వేళ‌, టీఆర్ఎస్ అభ్య‌ర్ధుల్ని ప్ర‌క‌టించిన వేళ‌. ఎన్నిక‌ల స‌మ‌రం మొద‌లైన వేళ‌. బ్ర‌హ్మాండం బ‌ద్ద‌లైన వేళ మౌనంగా ఉంటే అర్ధం ఏంటీ..?  రాములమ్మ గురించి స‌గ‌టు తెలంగాణ కార్య‌క‌ర్త ఇలాగే భావిస్తున్నాడా..? ఇంత‌కీ రాముల్మ ఎక్క‌డ..? ఇప్పుడు అజ్ఞాతాలు , అల‌క‌లు అంటే ఎలా అన్న ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానం చెబుతోందా..?
 
ఫైర్ బ్రాండ్ విజ‌య‌శాంతి అతి త‌క్కువ పేరుపొందిన మ‌హిళ‌ల్లో ఒక‌రు. కారు దిగి కాంగ్రెస్ కండువా వేసుకున్న త‌రువాత 2014 ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన త‌రువాత రాజ‌కీయంగా సైలెంట్ అయిపోయారు. నాలుగేళ్ళుగా తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రంపై క‌నిపించింది లేదు. వినిపించింది లేదు. ఇక్క‌డి వ‌ర‌కు అంద‌రికి తెలిసిందే.
కానీ ఇప్పుడు తెలంగాణ‌లో అసెంబ్లీ ర‌ద్దైంది. ఎన్నిక‌ల స‌మ‌రానికి తెర‌లేచింది. తెలంగాణ ఇచ్చికూడా గ‌త ఎన్నిక‌ల్లో అధికారాన్ని అందుకోలేక‌పోయింది కాంగ్రెస్ . ఈ ఎన్నిక‌లు ఆ పార్టీకి  అత్యంత కీల‌కం. ఇలాంటి త‌రుణంలో  విజ‌య శాంతి అజ్ఞాతాన్ని విడ‌వ‌క‌పోవ‌డం పార్టీనేత‌ల్లో చ‌ర్చాంశ‌నీయంగా మారిందట‌. అధిష్టానం త‌న‌ని గుర్తించ‌డం లేద‌ని,త‌న  స్థాయికి త‌గ్గ‌ట్లు హోదాని ఇవ్వ‌డం లేద‌ని,  విజ‌య‌శాంతి అలిగార‌ట‌. మొన్న‌టివ‌ర‌కు ఈ వెర్ష‌న్ చుట్టూ కాస్త సానుభూతి ఉంది. కానీ ఇప్పుడు ఎన్నిక‌ల వేళ‌ హోదాలు, ప‌ద‌వులు అంటూ  దూరంగంగా  మీద‌ ఉండ‌డంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అస‌హ‌నం వ్య‌క్త‌మవుతుంద‌ట‌. 
 
2014 ఎన్నిక‌ల తరువాత నుంచి విజ‌య‌శాంతి రాజ‌కీయంగా మౌనంగానే ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్న ఎప్పుడూ  యాక్టీవ్ గా లేరు. అయితే హ‌ఠాత్తుగా మ‌హంకాళి అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించ‌డానికి ఈ ఏడాదిలోనే భ‌య‌ట‌కివ‌చ్చారు విజ‌య‌శాంతి. దీంతో మ‌ళ్లీ యాక్టీవ్ కాబోతున్నార‌ని, పొలిటిక‌ల్ రీఎంట్రీకి రెడీ అవ్వ‌బోతున్నార‌ని పార్టీ కార్య‌క‌ర్త‌లు,నేత‌లు భావించారు. ఆ వెంట‌నే ఆమె కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు.రాహుల్ గాంధీ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు విజ‌య‌శాంతి. రెండు రోజుల పాటు పార్టీ అధినేత హైద‌రాబాద్ లో ఉంటే క‌నీసం క‌న‌పించ‌లేదు రాములమ్మ‌. పార్టీ త‌న‌స్థాయికి త‌గిన గుర్తింపు ఇవ్వ‌డం లేదని, చాలాసార్లు వాపోయార‌ట విజ‌య‌శాంతి,ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని ఆమె కోరుతున్నార‌ట‌.
 
కానీ అధిష్టానం పార్టీ కార్య‌ద‌ర్శి ప‌ద‌వి ఇస్తాన‌ని అన్న‌ద‌ట‌. దీంతో అల‌క‌పాన్పు దిగ‌డానికి విజ‌య‌శాంతి అంగీక‌రించ‌డం లేద‌ని పార్టీ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతూ వ‌చ్చాయి. అయితే అవన్నీ మామూలు సంద‌ర్భాల‌లో  ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు తెర‌లేచింది. ఇంత‌కీల‌కం స‌మ‌యంలో విజ‌య‌శాంతి మౌనం వీడ‌క‌పోతే ఎలా అన్న ప్ర‌శ్న కార్య‌క‌ర్త‌ల నుంచి వినిపిస్తోంద‌ట‌. ద‌క్షిణ భార‌త దేశం మొత్తాన్ని ప్ర‌భావితం  చేయ‌గ‌ల సినీ గ్లామ‌ర్ త‌న‌ద‌ని, త‌న స్థాయిని పార్టీ గుర్తించ‌డంలేద‌ని విజ‌య‌శాంతి ఆవేద‌న‌ట‌.
 
మ‌రి ఇప్పుడు తెలంగాణ‌లో ఎన్నిక‌ల స‌మరం మొద‌లైంది. త‌న స‌త్తా ఏంటో పార్టీకి చూపించాల్సిన త‌రుణంలో కూడా  అస్త్ర‌స‌న్యాసం గెటప్ ద‌గ్గ‌ర ఆగిపోవ‌డం పార్టీలో చ‌ర్చాంశ‌నీయంగా మారింది. అమెతిరిగి యాక్టీవ్ అవుతారా, లేదా అలాగే ఉండిపోతారా అన్న ప్ర‌శ్న‌లు జ‌వాబుకోసం కార్య‌క‌ర్త‌ల చుట్టూ తిరుగుతున్నాయి.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.