అడ్డంగా దొరికిన ప‌చ్చ‌నోట్లు వ‌ర‌ద‌

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

chandrababunaidu
Updated:  2018-10-27 12:21:27

అడ్డంగా దొరికిన ప‌చ్చ‌నోట్లు వ‌ర‌ద‌

తెలంగాణలో ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మ‌హాకూట‌మి గెలిపించుకోవాల‌ని కుతంత్రంతో ఏపీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పావులు క‌దుపుతున్నారు. ఇందుకోసం తెలంగాణ‌ వ్యాప్తంగా ప‌చ్చ‌నోట్ల వ‌ర‌ద పారించేందుకు వ‌ర‌ద‌ను సిద్దం చేశారు. తెలంగాణలో మ‌హాకూట‌మికి అధికారాన్ని క‌ట్ట పెట్టేందుకు సుమారు 500 కోట్ల‌రు ఖ‌ర్చు పెట్టేందుకు ఏపీ అధికార నాయ‌కులు సిద్ద‌మ‌య్యారు.
 
టీఆర్‌ఎస్ లో త‌న‌కు స‌న్నిహితులు అయిన ఓ ప‌దిమంది అభ్య‌ర్థుల ఖ‌ర్చును కూడా తానే భ‌రిస్తానని చెబుతున్న‌ట్టు కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ రాహుల్ గాంధీకి వెల్ల‌డించిన‌ట్లుగా తెలుస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వ ఏర్పాటుకు సీట్లు ఏమైన త‌గ్గితే ఆ ప‌దిమందిని తీసుకురాగ‌ల‌న‌ని చంద్ర‌బాబు నాయుడు భ‌రోసా ఇచ్చిన‌ట్లుగా స‌మాచారం. ఏఐఐసీసీనేత ఒక‌రు రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లో ఈ విష‌యంపై ఆరాతీసీ దృవీక‌రించిన‌ట్లుగా తెలుస్తోంది.
 
ఇప్ప‌టికే ఈ 500 కోట్ల‌ను హైద‌రాబాద్ లోని ప‌లుచోట్ల దాచిపెట్టార‌ని స‌మాచారం. టీడీపీకి అనుకూలంగా ఉండే న‌లుగురు వ్యాపారులు ఇద్ద‌రు కాంట్రాక్ట‌ర్ల క‌నుస‌న్న‌ల్లో ఈ డ‌బ్బుల‌ను దాచే వ్య‌వ‌హారం సాగుతోంద‌ని తెలంగాణా నిఘా వ‌ర్గాలకు స‌మాచారం అందింది. ఇందులో భాగంగానే క‌రీంన‌గ‌ర్ కు పంపించేందుకు సిద్దంగా ఉన్న డ‌బ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

షేర్ :

Comments

0 Comment