స‌మ‌యంలేదు మిత్ర‌మా గెల‌వ‌డ‌మా..ఓడిపోవ‌డమో

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

ktr and revanth reddy
Updated:  2018-08-31 17:03:08

స‌మ‌యంలేదు మిత్ర‌మా గెల‌వ‌డ‌మా..ఓడిపోవ‌డమో

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు స‌మ‌యం లేక‌పోవ‌డంతో ప‌లువురు నేత‌లు ప్ర‌త్య‌ర్ధుల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. స‌మ‌యంలేదు మిత్ర‌మా గెల‌వ‌డ‌మా..ఓడిపోవ‌డమో. ఓడిపోవ‌డం మా హిస్ట‌రీలో లేదంటే..గెలుపుకు కేరాఫ్ అడ్ర‌స్ మా పార్టీ అని జ‌బ్బ‌లు చ‌రుస్తూ  ప్ర‌త్య‌ర్ధి పార్టీల్ని చీల్చి చెండాడేస్తున్నారు.
 
ప్ర‌త్య‌ర్ధి ఎవ‌ర‌నేది మాకు అన‌వ‌స‌రం. మాట‌ల్ని తూటాల్లా పేల్చుతూ  గెలుపుకు మ‌లుపుతిప్ప‌డ‌మే మాధ్యేయ‌మంటూ హీటెక్కిస్తున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైంది. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా కాంగ్రెస్ - టీఆర్ఎస్ పార్టీలు ప్రచారాల్ని ముమ్మ‌రం చేశాయి. ఈ నేప‌థ్యంలో ఇరు పార్టీల‌కు చెందిన నేత‌లు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోస్తున్నారు. నువ్వెంత‌..నీ పార్టీ ఎంత‌ అని క‌య్యానికి కాలుదువుతున్నారు. 
 
ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తున్న ప్ర‌గ‌తి నివేధ‌న స‌భ‌పై కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. న‌ల్గొండ జిల్లా మాల్ లో రోడ్ షో నిర్వ‌హించిన రేవంత్..సీఎం కేసీఆర్ నిర్వ‌హిస్తున్న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ కాదు.. ప్ర‌గ‌తి ఆవేద‌న స‌భ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల్లో గెలుపు కోసం హ‌స్తిన వెళ్లిన కేసీఆర్ మోడీ వ‌ద్ద మోక‌రిల్లార‌ని విమ‌ర్శించారు. అంతేకాదు 2014 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ మ్యానెఫెస్టోలో ఎన్ని హామీలు నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. 
 
అయితే ఇదే వ్యాఖ్య‌ల‌పై మంత్రి కేటీఆర్ త‌న‌దైన శైలిలో ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ వెన్నుముక లేని పార్టీ అని అన్నారు. ఢిల్లీ పెద్ద‌లు ఏం చెబితే అది చేస్తార‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం ప్ర‌గ‌తి నివేద‌న స‌భ ఎందుకు నిర్వ‌హిస్తుందో తెలుసుకొని కాంగ్రెస్ నేత‌లు జ్ఞానోద‌యం పొందాల‌ని అన్నారు. 
 
2014 నుంచి నేటి వ‌ర‌కు టీఆర్ఎస్ పార్టీ 51 నెలల్లో ప్ర‌జ‌ల‌కు ఏం చేసింది. ఎన్నిఅభివృద్ధి కార్య‌క్ర‌మాల్ని అమ‌లు చేసింది. మ‌ళ్లీ అధికారం క‌ట్ట‌బెడితే ఏం చేస్తామ‌నేది ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ చెబుతార‌ని అన్నారు. ప్రజల నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకున్నామో వివరిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.