కేసిఆర్ ను అనుకరించబోయే నటుడు ఎవరు??

Breaking News

హోమ్        తెలంగాణ      న్యూస్

Updated:  2018-09-14 03:06:48

కేసిఆర్ ను అనుకరించబోయే నటుడు ఎవరు??

నందమూరి తారకరామా రావు గారి జీవిత ఆధారంగా ఆయన కుమారుడు రూపొందిస్తూ నటిస్తున్న చిత్రం NTR. చిత్రీకరణ పనునులు శరవేగంగా జరుగుతున్నాయి. గౌతమీపుత్ర శాతకర్ణి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వ భాధ్యతలు తీస్కున్నాడు. 
 
ఈ చిత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కూడా కీలకంగా రూపొందిస్తున్నారట. ఎన్టీఆర్‌తో కేసీఆర్ అనుబంధం ప్రత్యేకమైనవి. టీడీపీ శ్రేణులకు రాజకీయాలు బోధించిన సత్తా ఉన్న నేత కేసీఆర్. అటువంటి వ్యక్తి తాలుక ఛాయలు ఈ చిత్రంలో అస్సలు లేకపోతే బాగుండదని భావించిన చిత్ర యూనిట్ ఆయన పాత్రని కూడా కలపలాని సన్నాహాలు మొదలెట్టారు.
 
ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ను కలుసుకొన్న సీన్‌ ద్వారా కేసీఆర్‌ను చూపిస్తున్నారట. తన కుమారుడు కేటీఆర్‌ను వెంట తీసుకొని వెళ్లే సీన్‌ను చిత్రీకరించనున్నారట. అయితే ఆ పాత్రని ఎవరు పోషిస్తునారు అనేది గోప్యంగా ఉంచారు.తాజాగా అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ ఏఎన్నాఆర్‌గా కనిపించబోతున్నాడు. తన పాత్ర గురించి, మొదటి రోజు షూట్ గురించి సుమంత్ ఆసక్తికరంగా వెల్లడించారు. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్‌ కోసం మా తాతగారు చివరి కారులో డ్రైవింగ్ చేసుకొంటూ వెళ్లాను. నేను మా తాత అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించడం చాలా సంతోషంగా ఉంది అని సుమంత్ ట్వీటాడు.